వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీఎస్సీ-బీఈడీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోర్సు గతేడాదే ప్రారంభమైంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మేజర్ సబ్జెక్టులతో సెకండరీ స్థాయి ప్రోగ్రామ్‌ను వరంగల్ నిట్ అందిస్తోంది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు నాలుగేళ్ల కాల వ్యవధిలో బీఎస్సీ, బీఈడీ మిళితం చేసే ఇంటిగ్రేటెడ్ పాఠ్యాంశాలు కోర్సులో ఉంటాయి. 2024-25 విద్యాసంవత్సరానికి గాను సెప్టెంబర్‌లో కోర్సు ప్రారంభం కానుంది. ఎంపికైన విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 27వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: 2022/ 2023/ 2024 విద్యా సంవత్సరాల్లో 10+2 లేదా 12వ తరగతి/ ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్‌సీఈటీ)-2024 స్కోరు సాధించి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఎన్‌సీఈటీ-2024 స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి సీటు కేటాయిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ- ఎన్‌సీఎల్, జనరల్- ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.1600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.800 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. సెప్టెంబర్ 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. వివరాలకు www.nitw.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.