Nita Ambani: అనంత్-రాధిక పెళ్లికి వెండి, బంగారంతో చీరలు..షాపింగ్ చేసిన నీతా అంబానీ

Nita Ambani: అనంత్-రాధిక పెళ్లికి వెండి, బంగారంతో చీరలు..షాపింగ్ చేసిన నీతా అంబానీ

రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ నీతా అంబానీ.. తన కుమారుడి పెళ్లి దగ్గర పడుతుండంతో వారణాసిలో చీరలు షాపింగ్ చేశారు. వారణాసిలోని మరమగ్గాలపై నేసిన 50 బెనారస్ చీరలను ఆమె కొనుగోలు చేశారు. చీరలు చాలా బాగున్నాయి.. అని చేనేత కార్మికులను ప్రశంసిస్తూ మరిన్ని చీరలు కావాలని .. ఎంపిక చేసుకునేందుుక బనారసీ వ్యాపారులు, చేనేత కళాకారులను తనహోటల్ కి ఆహ్వానించారు నీతా అంబానీ. 

నీతా అంబానీ లక్ఖా బుటీ, హజారా బుటీ బనారసీ చీరలను ఇష్టపడి కొనుగోలు చేశారు. ఈ చీరలకు ఓ ప్రత్యేకత ఉంది. వీటిని చేనేత కళాకారులు ప్రత్యేకంగా టైం కేటాయించిన నేస్తారు. అద్బుతమైన కళా నైపుణ్యం ఇందులో కనిపిస్తుంది. అన్ని చీరలు నిజమైన జరీతో తయారు చేస్తారు. వీటిలో వెండి, బంగారు దారాలు ఉంటాయి. జరీలో దాదాపు 58-60 శాతం వెండి ఉంటుంది. వీటిలో 1.5 శాతం బంగారంతో చేయబడుతుంది. ఈ చీరల ధర రూ. 1.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఉంటుందని ఛోలే లాల్ పాల్ అనే బెనారస్ చేనేత కళాకారుడు అన్నారు.

లక్కా బ్యూటీ చీర ఒకటి నీతా అంబానీకి తెగ నచ్చిందని కొనుగోలు చేశారు. నీతా అంబానీ తన కుమారుడి పెళ్లిలోన నేను తయారు చేసిన చీరను కట్టుకుంటే అందరూ టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తారు..దీంతో నా పనిలో నేను సక్సెస్ అవుతున్నాను అని బెనారస్ చేనేత కళాకారుడు ఛోలే లాల్ పాల్ అంటున్నారు. 

బనారస్ హజారా బుటీ, లక్ఖా బుటీ చీరలకు ప్రసిద్ది. మేం తయారు చేస్తున్న చీరను లక్ఖ బుటి అంటారు. ఈ చీర ప్రత్యేకత ఏంటంటే.. ఈ చీరను సిద్దం చేసేందుకు చునారీ, పియారీలను హిందూ మత పవిత్రమైన కార్యక్రమాలలో మూడు సార్లు ఉపయోగిస్తారు.  ఈ చీరను తయారు చేయడానికి 60 నుంచి 62 రోజులు సమయం పడుతుంది.. అని బనారసీ చేనేత కళాకారుడు ఛోటే లాల్ పాల్ అన్నారు. 

నీతా అంబానీ హజారా బుటీ ప్రత్యేక చీరను  సెలెక్ట్ చేసుకుంది. ఈ చీర తయారీకి చాలా సమయం పడుతుంది. దాదాపు 32 వేల వెండి బుటీలతో ఈ హజారా బుటీ చీరను తయారు చేస్తాం.. హజారా బుటీ చీర తయారీకి 40-45 రోజులు సమయం పడుతుందని ’’ గోల్ ఘాట్ లోని అంజికా హత్ కర్ఘా హ్యాండ్ లూమ్ యజమాని అక్షయ్ అంటున్నారు.