IPL 2025: డబ్బుల్లేక మూడేళ్లు నూడుల్స్ తిని కడుపు నింపుకున్నారు: పాండ్యా సోదరులపై నీతా అంబానీ

IPL 2025: డబ్బుల్లేక మూడేళ్లు నూడుల్స్ తిని కడుపు నింపుకున్నారు: పాండ్యా సోదరులపై నీతా అంబానీ

ముంబై ఇండియన్స్ జట్టులోకి ఎవరైనా భారత డొమెస్టిక్ ప్లేయర్ చేరితే వారు త్వరలోనే టీమిండియాకు ఎంపికవ్వడం గ్యారంటీ. ఆ జట్టులో ఏం మ్యాజిక్ ఉంటుందో తెలియదు గాని స్టార్ ప్లేయర్లు అయిపోతారు. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, ఇషాన్ కిషాన్ ఇలా దాదాపు అరడజను ప్లేయర్లు భారత క్రికెట్ లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. అయితే  వీరందరిని తాము వెతికి పట్టుకున్నామని.. వారి కష్టాన్ని, కసిని గుర్తించే ముంబై జట్టులో చేర్చుకున్నామని ఆ జట్టు ఫ్రాంచైజీ నీతా అంబాని వెల్లడించారు. 

ముంబై ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీ, పాండ్య బ్రదర్స్, జస్ప్రీత్ బుమ్రాలను తమ జట్టులోకి తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. కృనాల్ జట్టు నుంచి వైదొలిగినప్పటికీ బుమ్రా తన ఐపీఎల్ కెరీర్ అంతా ముంబైతోనే ఉన్నాడు. హార్దిక్ గుజరాత్ టైటాన్స్ కు ఆడినా.. ఐపీఎల్ 2024 సీజన్‌లో కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. క్రికెట్‌లో రాణించాలనే తపన, ఆకలి హార్దిక్, కృనాల్ లో ఉన్నాయని.. అందుకే వారిని జట్టులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నానని ఎంఐ యజమాని చెప్పారు.

"ఐపీఎల్ లో మనందరికీ ఒక నిర్దిష్ట బడ్జెట్ ఉంటుంది. ప్రతి జట్టుకు కొంత మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు. దీంతో ప్రతిభ గల ఆటగాళ్లను వెతకాలని నిర్ణయించుకున్నాం. నా స్కౌట్స్, నేను ప్రతి రంజీ ట్రోఫీ మ్యాచ్ కు వెళ్ళాను. ఒక రోజు మా స్కౌట్స్ ఇద్దరు సన్నగా ఉన్న ఆటగాళ్ల దగ్గరకు తీసుకెళ్లారు. నేను వారితో మాట్లాడుతున్నప్పుడు వారు మూడు సంవత్సరాలుగా డబ్బు లేకపోవడంతో మ్యాగీ నూడుల్స్ తప్ప మరేమీ తినలేదని చెప్పారు.  వారిద్దరే హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. 2015 లో నేను హార్దిక్ పాండ్యాను వేలంలో 10 వేల యూఎస్  డాలర్లకు కొనుగోలు చేశాను. అతడు నేడు ముంబై ఇండియన్స్ గర్వించదగిన కెప్టెన్" అని నీతా అంబానీ అన్నారు.

'బుమ్రా బంతితో మాట్లాడగలడు'

బుమ్రా గురించి స్కౌట్స్ తనకు ఎలా చెప్పారో నీతా అంబానీ వెల్లడించారు. మా స్కౌట్స్ విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ ను కలిగిన క్రికెటర్ ను నాకు పరిచయం చేశారు. దీంతో అతన్ని ముంబై జట్టులోకి తీసుకున్నాం. ఆ తర్వాత బుమ్రా క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. గత సంవత్సరం మేము తిలక్ వర్మను తీసుకున్నాం. అతడు ఇప్పుడు టీమ్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్. ముంబై ఇండియన్స్‌ను ఇండియా క్రికెట్ నర్సరీ అని పిలవడం అని పిలవొచ్చు". అని నీతా అంబానీ అన్నారు. 2025 ఐపీఎల్ సీజన్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనున్నారు.