
మెదక్ టౌన్, కొండాపూర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ సూచించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆఫీసర్వికాస్ రాజ్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన పోలింగ్ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మశ్రీ, సీపీవో కృష్ణయ్య, డీఈవో రాధాకిషన్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, డీటీవో చిన్న సాయిలు, ఏడీ గోవింద్, మెదక్, నర్సాపూర్ ఆర్డీవోలు అంబదాస్ రాజేశ్వర్, శ్రీనివాస్ డీఎస్వో రాజిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.