కారణమిదే: క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకున్న నితిన్ మూవీ.. నిర్మాణ సంస్థ అధికారిక పోస్ట్‌

కారణమిదే: క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకున్న నితిన్ మూవీ.. నిర్మాణ సంస్థ అధికారిక పోస్ట్‌

నితిన్ హీరోగా వెంకీ కుడుముల(Venkykudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రాబిన్ హుడ్ (Robinhood). యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ క్రిస్మస్ నుంచి తప్పుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ముందుగా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానున్నట్లు తెలిపిన మేకర్స్.. ఇవాళ (Dec 17న) క్రిస్మస్ బరి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ త్వరలో మరో కొత్త రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తామని వెల్లడించారు. అయితే, అనుకోని పరిస్థితుల వల్ల రాబిన్ హుడ్ సినిమాని వాయిదా వేయాల్సి వచ్చిందంటూ మైత్రీ మూవీస్‌ పోస్ట్ ద్వారా తెలిపింది.

ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దాంతో రాబిన్ హుడ్ పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇదే ఈ సినిమా విడుదల ఆలస్యమైనట్లు సినీ వర్గాల సమాచారం. అలాగే మైత్రి మేకర్స్ నిర్మించిన పుష్ప 2 మూవీ ఇంకా థియేటర్స్లో రాణిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దాంతో రాబిన్ హుడ్ కలెక్షన్స్కి పుష్ప 2 అడ్డుకాకూడదనే ఉద్దేశ్యం కూడా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. 

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ చూస్తుంటే..రాబిన్ హుడ్ తరహాలోనే..జనాల నుంచి సొమ్మును కాజేసే క్యారెక్టర్లో హీరో నితిన్ కనిపిస్తాడని తెలుస్తోంది. "హైఫై ఇళ్లల్లో చోరీలు.. ఇంత మంది దాచుకున్న మనీని దోచుకుపోతున్న హానీ సింగ్ ఎవరు? అంటూ స్టార్ట్ అవుతూనే రాబిన్ హుడ్ సినిమా నేపథ్యం చెప్పేశారు. 'రాబిన్ హుడ్ వాడికి పర్టికులర్ జెండా.. ఎజెండా అవేమి లేవు.. డబ్బు కోసం వాడు ఎక్కడికైనా ఎదురెలుతాడు.." అంటూ హీరో క్యారెక్టరైజేషన్ ఒక్క డైలాగ్తో ఆసక్తి రేపారు. అలాగే 'నా కంట్రీకి వచ్చి.. నా వాళ్ళ జోలికే వస్తారా.. యూ బ్లడీ ఫారెనర్స్' అంటూ నితిన్ డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ALSO READ | ప్రేమించి మోసం చేశావు.. ఇడిచిపెట్టను

ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ జంట ఇటీవలే ఎక్స్ ట్రా మూవీలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా అయినా నితిన్ కు హిట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.