
నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్‍హుడ్ (Robinhood).వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు (మార్చి 28న)00 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రాబిన్‍హుడ్ ఓటీటీ, శాటిలైట్ వివరాలు బయటకు వచ్చాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రాబిన్‌హుడ్ డిజిటల్ హక్కులను Zee5 ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుందని సమాచారం. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కి రానుంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది. ఇలా, రాబిన్‍హుడ్ డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. నితిన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో వస్తోన్న ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడవ్వడం విశేషం.
అయితే, ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకునే అంశం ఏంటంటే.. ఈ సినిమా OTT మరియు శాటిలైట్ విడుదల ఒకే రోజున జరగనున్నాయి. రీసెంట్ గా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ తరహాలోనే రాబిన్ హుడ్ రానుంది.
Also Read : ప్రపంచంలో రూ.200 కోట్లు భరణం వద్దనుకున్న ఏకైక నటి సమంత
ఇకపోతే, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం మెయిన్ ఫిల్లర్ అయింది. ఇప్పటికే ఆయన కంపోజ్ చేసిన పాటలు మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. రీల్స్, షార్ట్స్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది సినిమాకు ఒకరకంగా మరింత హైప్‌ను పెంచేసింది.
ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేశారు. దీంతో మరింత క్రేజ్ నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ మూవీకి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేశారు.
THE BIGGEST SUMMER ENTERTAINER IS ALMOST HERE 💥💥#Robinhood GRAND RELEASE WORLDWIDE TOMORROW.
— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2025
Bookings now open in ALL REGIONS & ALL CENTRES WORLDWIDE ❤️🔥
🎟️ https://t.co/ogblfmwZTd@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @davidwarner31 @gvprakash #RajendraPrasad… pic.twitter.com/SX2I5rpqSP