Robinhood Review: రాబిన్ హుడ్ రివ్యూ.. నితిన్-శ్రీలీల మూవీ ఎలా ఉందంటే?

Robinhood Review: రాబిన్ హుడ్ రివ్యూ.. నితిన్-శ్రీలీల మూవీ ఎలా ఉందంటే?

నితిన్ నటించిన రాబిన్‌హుడ్ మూవీ నేడు (మార్చి 28న) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీని వెంకీ కుడుములు తెరకెక్కించాడు. శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ గెస్ట్ రోల్ చేశాడు. పదిరోజుల నుంచి మేకర్స్ తమ ప్రమోషన్లతోనే ఆడియన్స్లో అంచనాలు పెంచేశారు.

నేడు భారీ అంచనాల నడుమ థియేటర్లోకి వచ్చిన, ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంది? నితిన్-వెంకీకి మరో హిట్ దక్కిందా? అనేది పూర్తీ రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే:

రామ్ (నితిన్) ఓ అనాథ. చిన్నప్పటినుంచి ఓ అనాథశ్రమంలో పెరుగుతాడు. ఈ ఆశ్రమాన్ని బయట వచ్చే విరాళాలలతో శుభలేఖ సుధాకర్ నడిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో దాతల నుంచి విరాళాలు లేక పిల్లల తిండికి కూడాఇబ్బంది పడే పరిస్థితి వస్తోంది. ఎలాగైనా అందరి కడుపు నింపాలనే ఉద్దేశ్యంతో రామ్ దొంగతనాలు చేయడం మొదలుపెడతాడు. పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అని రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని వంట బట్టించుకుని వరుస దొంగతనాలు చేస్తుంటాడు. ఇక రామ్ చేసే దంగతనాలను ఆపేయాలని విక్టర్ (షైన్ చాం టాకో) రంగంలోకి దిగుతాడు. కానీ రాబిన్‍హుడ్‌ను పట్టుకోలేకపోతాడు.

ఒక ఇన్సిడెంట్ వల్ల రామ్ దొంగతనాలు ఆపేస్తాడు. ఆ వెంటనే జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేందర్ ప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత అభినవ్ వాసుదేవ్ (షిజు) కూతురు నీర (శ్రీలీల) ఇండియాకు రావాలని అనుకుంటుంది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి రామ్ కాంట్రాక్ట్ తీసుకుంటాడు.

Also Read :  నేడు (మార్చి 28న) ఓటీటీలో 12కి పైగా సినిమాలు

అక్కడి నుంచి సెక్యూరిటీ ఏజెన్సీ.. నీరాని రుద్రకొండకి తీసుకెళ్లాల్సి వస్తోంది? ఫార్మా కంపెనీ అధినేత అభినవ్ వాసుదేవ్ కి రుద్రకొండకి మధ్య సంబంధం ఏంటీ? రుద్రకొండలో ఉండే సామి (దేవదత్తా నాగే) ఎవరు? ఈ అందరితో డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ (డేవిడ్ వార్నర్)కి సంబంధం ఏంటీ? అనే తదితర విషయాలు తెలియాలంటే రాబిన్‌హుడ్ మూవీని థియేటర్లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

రాబిన్‌హుడ్ కోసం ఎంచుకున్న కథలోని సోల్ ఏదైతే ఉందో అది పాతదే. అనాథశ్రమంలో ఉండే పిల్లాడు, పెరిగి పెద్దయ్యాక.. ఆశ్రమం కోసం పోరాడే సినిమాలు తెలుగులో చూస్తూ వచ్చాం. కానీ, ఇక్కడ రుద్రకొండ అనే గ్రామం, ఆ గ్రామపు నెలలో పండే విలువచేసే గంజాయి, దాని కోసం దేనికైనా తెగించే ఓ అత్యంత క్రూరుడు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని చూసే ఓ కొత్త పాయింట్ ని తీసుకున్నాడు.

ఈ క్రమంలో రామ్ క్యారెక్టర్, వాసుదేవ్ కూతురు నీరా వాసుదేవ్ ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ తో ఫస్టాఫ్ రాసుకున్నాడు.  ముఖ్యంగా రాజేంద్రప్రసాద్- నితిన్- వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు. మరి ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఈ సినిమాకు సేవియర్‌లా తనదైన కామెడీతో అలరించాడు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకండాఫ్ పై హోప్స్ పెంచే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.

సెకండ్ హాఫ్ లో వచ్చే రుద్ర కొండ విలేజ్ డ్రామా, డీసెంట్ ఎమోషన్స్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది.క్లైమాక్స్ మెప్పిస్తుంది. డైరెక్టర్ వెంకీ కుడుముల కామెడీతో పాటు రాసుకున్న ట్విస్టులు రాబిన్‌హుడ్ టైటిల్ కు న్యాయం చేస్తాయి.

ఎవరెలా చేశారంటే:

నితిన్‌, శ్రీలీల, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వెన్నెల‌కిషోర్ కాంబోలో వ‌చ్చే కామెడీ సీన్స్ అదిరిపోయాయి. నితిన్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీలీల తన అందంతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది. కేతిక శర్మ అదిదా స్పెషల్ సాంగ్ కుర్రాళ్ల మతి పోగొట్టేలా చేసింది. దేవ దత్త పాత్ర భయపెట్టేలా ఉంటుంది. క్యామియో రోల్ చేసిన డేవిడ్ వార్నర్ పాత్ర పరిధి తక్కువే అయిన, ఇంపాక్ట్ ఇచ్చాడు. వార్నర్ ఎంట్రీతో థియేటర్స్ లో విజిల్స్ మోగిపోతాయి. మిగతా నటి నటులు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. 

సాంకేతిక అంశాలు:

వెంకీ కుడుముల మరోసారి కామెడీ, ల‌వ్ స్టోరీ, యాక్ష‌న్ తో మెప్పించాడు. ట్విస్టులు బాగా రాసుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ 'అదిదా సాంగ్' విజిల్స్ వేయిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంటెన్స్గా ఉంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఎడిటర్ కోటి పనితనం మెప్పించింది. మైత్రి మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.