Robinhood OTT: ఒకేరోజు ఓటీటీ & టీవీల్లోకి నితిన్ రాబిన్‍హుడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Robinhood OTT: ఒకేరోజు ఓటీటీ & టీవీల్లోకి నితిన్ రాబిన్‍హుడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్‍హుడ్ (Robinhood). కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీని వెంకీ కుడుముల తెరకెక్కించాడు. భారీ అంచనాలతో మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది.

దాదాపు రూ.29 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. నితిన్ కెరీర్లో మరో డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో రాబిన్‍హుడ్ ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది.

రాబిన్‍హుడ్ ఓటీటీ:

నితిన్ రాబిన్‍హుడ్ ఓటీటీ హక్కులను  Zee5 ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ సొంతం దక్కించుకుంది. నితిన్ కెరీర్లో భారీ బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడయ్యాయి. ఇప్పుడీ మూవీ ఓటీటీలో, టీవీలో ఒకే రోజు స్ట్రీమింగ్ కాబోతుంది. వచ్చే నెల మే 2న జీ5 ఓటీటీతో పాటు జీ తెలుగు ఛానల్లో ఈ మూవీ వచ్చేస్తుంది. త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేశారు. కానీ, ఏ మాత్రం ప్లస్ అవ్వలేదు.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ మూవీకి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేశారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించారు.

కథేంటంటే:

రామ్ (నితిన్) ఓ అనాథ. చిన్నప్పటినుంచి ఓ అనాథశ్రమంలో పెరుగుతాడు. ఈ ఆశ్రమాన్ని బయట వచ్చే విరాళాలలతో శుభలేఖ సుధాకర్ నడిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో దాతల నుంచి విరాళాలు లేక పిల్లల తిండికి కూడాఇబ్బంది పడే పరిస్థితి వస్తోంది. ఎలాగైనా అందరి కడుపు నింపాలనే ఉద్దేశ్యంతో రామ్.. రాబిన్‌హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అని రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని వంట బట్టించుకుని వరుస దొంగతనాలు చేస్తుంటాడు. ఇక రామ్ చేసే దంగతనాలను ఆపేయాలని విక్టర్ (షైన్ చాం టాకో) రంగంలోకి దిగుతాడు. కానీ రాబిన్‍హుడ్‌ను పట్టుకోలేకపోతాడు.

ఒక ఇన్సిడెంట్ వల్ల రామ్ దొంగతనాలు ఆపేస్తాడు. ఆ వెంటనే జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేందర్ ప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత అభినవ్ వాసుదేవ్ (షిజు) కూతురు నీర (శ్రీలీల) ఇండియాకు రావాలని అనుకుంటుంది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి రామ్ కాంట్రాక్ట్ తీసుకుంటాడు.

అక్కడి నుంచి సెక్యూరిటీ ఏజెన్సీ.. నీరాని రుద్రకొండకి తీసుకెళ్లాల్సి వస్తోంది? ఫార్మా కంపెనీ అధినేత అభినవ్ వాసుదేవ్ కి రుద్రకొండకి మధ్య సంబంధం ఏంటీ? రుద్రకొండలో ఉండే సామి (దేవదత్తా నాగే) ఎవరు? ఈ అందరితో డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ (డేవిడ్ వార్నర్)కి సంబంధం ఏంటీ? అనే తదితర విషయాలు తెలియాలంటే రాబిన్‌హుడ్ మూవీని చూడాల్సిందే.