బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు నితిన్ (Nithiin). ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో వెంకీ కుడుముల(Venkykudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రాబిన్ హుడ్.ఈ మూవీకి సంబంధించి మోసగాడి ముఖాన్ని మీ ముందుకు తీసుకు వస్తున్నాం అంటూ మైత్రీ మూవీ మేకర్స్..నితిన్ ఫస్ట్ లుక్ తో పాటు..సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా శ్రీరామనవమి సందర్బంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. "రాబిన్ హుడ్ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా క్రిస్మస్ స్పెషల్ గా వస్తుండటంతో డిసెంబర్ 31 వరకు టైం కలిసోచ్చేలా ఉంది.ఇప్పటివరకైతే ఆ టైం కు పోటీగా వేరే సినిమాలేం లేవు. దీంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Make way for the conman you'd love to meet ❤🔥#Robinhood in cinemas from December 20th, 2024 💥💥@actor_nithiin @VenkyKudumula @gvprakash @SonyMusicSouth pic.twitter.com/8uARUhDGlX
— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2024
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ జంట ఇటీవలే ఎక్స్ ట్రా మూవీలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాశి ఖన్నాను కూడా సంప్రదించినట్లు తెలుస్తుంది.త్వరలోనే హీరోయిన్ ఎవరినేది మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.మరి ఈ సినిమా అయిన నితిన్ కు హిట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.