Robinhood Censor Review: రాబిన్‌హుడ్ సెన్సార్ రివ్యూ.. సినిమాకు హైలైట్స్ ఇవే.. వార్నర్ రోల్ ఎంతంటే?

Robinhood Censor Review: రాబిన్‌హుడ్ సెన్సార్ రివ్యూ.. సినిమాకు హైలైట్స్ ఇవే.. వార్నర్ రోల్ ఎంతంటే?

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల రూపొందించిన చిత్రం ‘రాబిన్‌‌హుడ్‌‌’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. సినీ, క్రికెట్ ఫ్యాన్స్ అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకుని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రాబిన్‌‌హుడ్‌‌ సెన్సార్ టాక్ పూర్తిచేసుకుని రివ్యూలు ఊపందుకున్నాయి. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే అంటూ ఇంటర్నల్ రిపోర్టులు బయటకి వచ్చాయి. మరి సినిమా ఎలా ఉంది? సెన్సార్ ఎటువంటి సర్టిఫికెట్ జారీ చేసింది? అనే వివరాలు చూసేద్దాం. 

రాబిన్‌హుడ్ సెన్సార్:

రాబిన్‌హుడ్ మూవీ సెన్సార్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వం వహించి, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. రన్‌టైమ్ 2 గంటల 36 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. రాబిన్‌హుడ్ సినిమాకు ఏపీ ప్రభుత్వం కొన్నిచోట్ల టికెట్ ధరను పెంచారు. ఇది సినిమా కలెక్షన్లకు ప్రధాన బలంగా నిలిచే అవకాశముంది. 

రాబిన్‌హుడ్ సెన్సార్ రివ్యూ:

కామెడీ, రొమాన్స్, యాక్షన్ మరియు భావోద్వేగాలతో సినిమా ఉందని సెన్సార్ సభ్యుల సమాచారం. కామెడీ ప్రేక్షకులను మెప్పించేలా ఉండడంతో పాటు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయనే టాక్ నడుస్తోంది. వెంకీ కుడుముల గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గని హైప్స్ ఇందులో ఉన్నాయట.

ALSO READ | Varun Tej: కామెడీ కాదు, హారర్ కామెడీ.. వరుణ్ తేజ్తో గాంధీ మ్యాజిక్ చేయాల్సిందే!

వెన్నెల కిషోర్ మరియు రాజేంద్ర ప్రసాద్ ల మధ్య ఫస్టాఫ్ కామెడీ సీన్స్ అదిరిపోయాయట. నితిన్ మరియు శ్రీలీల మధ్య రొమాంటిక్ ట్రాక్ తో పాటు కామెడీ నేచర్ సైతం అలరిస్తుందని సమాచారం. ఇక మెయిన్ గా చెప్పుకోవాలంటే, ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతుందని, అప్పుడు వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుందని టాక్. ఈ సినిమాకు ఇదే మెయిన్ హైలైట్‍గా ఉంటుందని సెన్సార్ బృందం చెప్పినట్టు సమాచారం.

ఇక సెకండాఫ్‍లో కామెడీతో పాటు ఎమోషన్లు, యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని తెలుస్తోంది. దానికోతోడు క్లైమాక్స్‌‌ సూపర్ కిక్ ఇవ్వబోతుందట. ఇక లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్  రోల్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుందట. దాదాపు 3 నిమిషాల పాటు తా పాత్ర ఉంటుందని టాక్. మొత్తానికి రాబిన్‌హుడ్ సినిమాకు సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ లభించింది. 

'U/A' సర్టిఫికేట్:

ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.