
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల రూపొందించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమా నేడు (మార్చి 28న) విడుదలైంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అందుకు ముఖ్య కారణం 'అది దా సర్ప్రైజ్' ఐటెం సాంగ్. అలాగే అన్నింటి కంటే ముఖ్యంగా వార్నర్ ఈ మూవీలో గెస్ట్ రోల్ చేయడం. అతన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకురావడం. ఆ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, దానికి తోడు నితిన్, శ్రీలీల ఇంటర్వ్యూ ప్రోమోలు.
ఇందులో 'డబ్బున్న వాళ్ల ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని, మారువేషాల్లో దోపిడీలు చేసే మోడరన్ రాబిన్ హుడ్ గా నితిన్ కనిపించాడు. ఈ సినిమా ప్రీమియర్ల (మార్చి 27) ప్రదర్శన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో ఎలా స్పందించారు? ఆడియన్స్ అంచనాలు ఎలా ఉన్నాయి? మూవీ ఆకట్టుకుందా.. లేదా అనే పూర్తి వివరాలు X రివ్యూలో తెలుసుకుందాం.
Also Read:-‘మ్యాడ్ స్క్వేర్’ X రివ్యూ.. మ్యాడ్‌కు మించిన ఆ నలుగురి అల్లరి
రాబిన్‌హుడ్ మూవీ ఫస్టాఫ్ కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉందని, కామెడీ ప్రేక్షకులను మెప్పించేలా ఉండడంతో పాటు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని నెటిజన్స్ నుంచి టాక్ మొదలైంది. ఫస్టాఫ్ లోని కామెడీ వర్కౌట్ అవ్వడమే, ఈ సినిమాను కాపాడే ప్రధాన అంశమని అంటున్నారు.
కొన్నిచోట్ల సెకండాఫ్ భీష్మ మూవీని గుర్తుచేస్తుందని మాట్లాడుకుంటున్నారు. రాబిన్‌హుడ్‌కు సీక్వెల్ కూడా ఉందని, ఈ సెకండ్ పార్ట్‌లో డేవిడ్ వార్నర్ విలన్‌గా కనిపించబోతున్నట్లు క్లైమాక్స్‌లో చూపించడం మాత్రం సర్ప్రైజింగ్గా అనిపిస్తుందని అంటున్నారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'నా షో అయిపోయింది, సెకండాఫ్ బాగుంది, శ్రీలీల సన్నివేశాలు తప్ప ప్రతి ఎపిసోడ్ బాగానే వర్కవుట్ అయింది. చివరిలో డేవిడ్ భాయ్ అతిధి పాత్ర చాలా నవ్వు తెప్పిస్తుంది!! అదిదా సుర్ప్రైస్ పాట బాగుంది..!! మొత్తం మీద మంచి కమర్షియల్ ఎంటర్టైనర్' అని ట్వీట్ చేశాడు.
Done with my show,good 2nd half, where each & every episode worked out except cringe Leela portions. David Bhai cameo at the end is hilarious!!adidha suprisu song is good..!! Overall a decent commercial entertainer 2.5/5 #Robinhood
— Peter Reviews (@urstrulyPeter) March 27, 2025
రాబిన్‌హుడ్ ఈ సమ్మర్ కి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నితిన్ మరియు రాజేంద్రప్రసాద్ ఈ చిత్రానికి అతిపెద్ద బలం. దర్శకుడు వెంకీ కుడుముల తన ట్రేడ్‌మార్క్ కామెడీ మరియు స్క్రీన్‌ప్లేతో తనదైన కథను అందించారు. కొత్త స్టార్ డేవిడ్ వార్నర్ క్యామియో పూర్తి గూస్బంప్స్ తెప్పిస్తుంది. హీరోయిన్ శ్రీలీల తన పాత్రతో అట్ట్రాక్ట్ చేసింది. జీవీ ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
#Robinhood Review : SUMMER FULL FAMILY ENTERTAINER - 3.5/5 🔥🔥🔥
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 28, 2025
ACTOR @actor_nithiin and #RajendraPrasad GAARU DUO WAS THE BIGGEST ASSET TO THE FILM 🎥
DIRECTOR @VenkyKudumula DEALED THE SIMPLE STORY WITH HIS TRADEMARK COMEDY AND SCREENPLAY 💥💥🔥🔥👍👍
NEW STAR ⭐️… pic.twitter.com/b8EFYU2PD4
కమర్షియల్ సినిమాగా రాబిన్ హుడ్, కథాంశం మరియు ట్రీట్మెంట్ చాలా రొటీన్ గా ఉంది. కానీ వెన్నెల కిషోర్ అండ్ & రాజేంద్రప్రసాద్ చేసిన కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. వీరి కామెడీ థియేటర్ లో మంచి నవ్వులు పూయించింది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటే, సినిమా అదిరిపోయేది అని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు.
Done with 1st Half of #Robinhood !
— FILMOVIEW (@FILMOVIEW_) March 27, 2025
Here is the #Review so far:
Strictly Average!!
As a commercial cinema, plot and treatment is quite routine, but the comedy by #VennelaKishore & #RajendraPrasad garu worked out to an extent!
Generated good laughs in the theatre!
Needs a very… https://t.co/3yhnScEFtP
రాబిన్‌హుడ్ కంప్లీట్ ఎంటర్టైనర్. ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ జస్ట్ ఒకే. ఈ సినిమాలో కథ అంతగా ఉండదు. అలా సరదాగా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు అని ఓ నెటిజన్ తెలిపాడు.
Show completed:- #Robinhood
— venkatesh kilaru (@kilaru_venki) March 27, 2025
Fun entertainer 👍
Above average movie 2.75/5
First half is good
Okayish Second half
Not a story based film ... go with the flow
Go with your family , have fun#Robinhood series will continue... 2nd part villain @davidwarner31 pic.twitter.com/yrd3PGpsl6
#RobinHood so far is just okay. Follows a routine commercial template with nothing new. Comedy clicks at times, but the flow is messy. Interval fight is stylish, and the camera work is decent.
— Dingu420 (@dingu420) March 28, 2025
Hoping for a stronger second half! 🤞 #RobinHoodReview #Robinhood #nithin pic.twitter.com/mTrRsM3i03