Nithiin: మారిన ప్లాన్‌.. రాబిన్‌హుడ్ డిజాస్ట‌ర్‌తో అయోమయం.. నితిన్ కొత్త సినిమా నిలబెట్టేనా?

Nithiin: మారిన ప్లాన్‌.. రాబిన్‌హుడ్ డిజాస్ట‌ర్‌తో అయోమయం.. నితిన్ కొత్త సినిమా నిలబెట్టేనా?

చాలా ఆశలు పెట్టుకుని చేసిన రాబిన్ హుడ్ తీవ్రంగా నిరాశపరచడంతో నితిన్ ఫ్యాన్స్ 'తమ్ముడు' కోసం ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా 'తమ్ముడు'. భారీ బడ్జెట్ తో వస్తోన్న ఈ మూవీపై  ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి.

తాజాగా తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులై 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

2025 మహాశివరాత్రికే సినిమా రిలీజ్ కానుందని అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైంది. ఇంతలో రాబిన్ హుడ్ మూవీ వచ్చేసింది. నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా బాక్సాఫీస్ డిజాస్టర్ గా నిలిచింది. 

ఇదిలా ఉంటే.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా, లయ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. కాంతార, మంగళవారం ఫేమ్ అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. 

చాలా కాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న నితిన్ ఈ సినిమాతో అయినా హిట్టు కొడతాడని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స‌ట్రార్డిన‌రీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇలా వరుస ఫెయిల్యూర్స్ తో నితిన్ కెరీర్ సాగుతోంది. మరి ఈ సినిమాతో ఐన హిట్ కొడుతాడో లేదో చూడాలి.