సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు నితిన్. రీసెంట్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మీ హీరోయిన్‌గా ఓ మూవీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికంటే ముందు వక్కంతం వంశీ డైరెక్షన్‌లోనూ ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మొదలుపెట్టాడు.
తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఓ కొత్త అప్‌డేట్ వినిపిస్తోంది. వినాయక చవితి సందర్భంగా సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారట. ఇందులో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘సైతాన్’ టైటిల్ పరిశీలనలో ఉంది. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.