దుబాయ్: టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 26 మంది మ్యాచ్ అఫీషియల్స్‌ను ప్రకటించింది. ఇండియా నుంచి రిఫరీ జవగళ్ శ్రీనాథ్‌తో పాటు అంపైర్లు నితిన్ మేనన్, జయరామన్ మదన్‌గోపాల్ ఇందులో ఉన్నారు. జూన్ 1 నుంచి మొదలయ్యే మెగా టోర్నీలో వీళ్లు ఫస్ట్ రౌండ్స్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయనున్నారు. అమెరికా, వెస్టిండీస్‌లో కలిపి 9 వేదికల్లో జరిగే 55 మ్యాచ్‌లకు 20 మంది అంపైర్లను సెలెక్ట్ చేశారు. ఇందులో ధర్మసేన, ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బరో, మదన్‌గోపాల్, నితిన్ తదితరులు అంపైర్లుగా పని చేయనున్నారు. శ్రీనాథ్, డేవిడ్ బూన్, మధుగలే తదితరులు రిఫరీలుగా వ్యవహరించనున్నారు.