Extra Ordinary Man Movie X Review: ఆర్డినరీ కథతో వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్

Extra Ordinary Man Movie X Review: ఆర్డినరీ కథతో వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్

యూత్ స్టార్ నితిన్(Nithin) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్(Extra OrdinaryMan). దర్శకుడు వక్కంతం వంశీ(Vakkantham Vamshi) తెరకెక్కించిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటించగా శ్రేష్ట్ మూవీ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాపై ముందునుండే మంచి అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేయగా.. ఈ సినిమా నేడు(డిసెంబర్8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే పలు చోట్ల షోస్ పడగా సినిమా చూసిన ఆడియన్స్ ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్ మూవీపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి సినిమా ఎలా ఉంది? నితిన్ కు హిట్ పడిందా? ఆడియన్స్ ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ సూపర్ అని, సెకండ్ హాఫ్ కాస్త బోరింగ్ గా ఉందని చెప్తున్నారు. సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయిందని, హీరో నితిన్ అద్భుతంగా చేశారని, చాలా రోజుల తరువాత చాలా ఎనర్జిటిక్ గా కనిపించారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా మెయిన్ గా చెప్పుకోవాల్సింది నటుడు రావు రమేష్ గురించి. నితిన్, రావు రమేష్ మధ్య  వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయని చూపిస్తున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన రాజశేఖర్ నవ్వులు పోయించారని, కనిపించింది చిన్న పాత్రలో అయినా ఆ ఇంపాక్ట్ సినిమాలో కనిపిస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక దర్శకుడు వక్కంతం వంశీ కామెడీ సీన్స్ పై పెట్టిన శ్రద్ధ కాస్త సెకండ్ హాఫ్ పై క్కూడా పెట్టుంటే బాగుండేదని అభిప్రాయ పడుతున్నారు.