నితిన్ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎక్స్‌ట్రా’ ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) ట్యాగ్‌లైన్‌తో శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియెన్స్‌కి రోలర్ కోస్టర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ, నవ్విస్తూనే సర్‌ప్రైజ్‌లతో టీజర్ అదిరిపోయింది. ఈ మూవీలో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసేక్యారెక్టర్ ను నితిన్ చేశాడు.
నితిన్ విభిన్నమైన గెటప్‍ల్లో కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. హీరోయిన్ శ్రీలీల..'నువ్వు కొబ్బరిమట్ట సినిమాలో ఉన్నావ్ కదా.. అంటూ నితిన్‍తో చెప్పే డైలాగ్ అదిరిపోయింది. నితిన్ తండ్రిగా నటించిన రావు రమేశ్ తనదైన స్టైల్ లో టీజర్లో హైలైట్‍గా నిలిచారు. 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ టీజర్ మొత్తం దాదాపు ఫన్నీ మూమెంట్స్ తో వక్కంతం వంశీ చూపించారు. ఇక ఈ మూవీలో హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు
హ్యారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘డేంజర్ పిల్లా’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. . ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 8న సినిమా విడుదల కానుంది.