Nithin Kamath: 25 ఏళ్లలో బంగారం Vs స్టాక్ మార్కెట్స్: ఎందులో లాభాలెక్కువ వచ్చాయ్..?

Nithin Kamath: 25 ఏళ్లలో బంగారం Vs స్టాక్ మార్కెట్స్: ఎందులో లాభాలెక్కువ వచ్చాయ్..?

Gold Vs Stock Markets: చాలా మంది పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో ఎలాంటి అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడిని అందుకుంటారనే విషయంపై రీసెర్చ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లలో ఎల్లప్పుడూ బుల్ జోరు లేదా ఎల్లప్పుడూ బేర్స్ పంజా ఉండదు. ఇందులో ఒక సైకిల్ ప్రకారం మార్కెట్ల అనేక ప్రపంచ అంశాలకు అనుగుణంగా రియాక్ట్ అవుతుంటాయి. కానీ చాలా మందికి మాత్రం సేఫ్ హెవెన్ గోల్డ్ అంటారు కథ మరి దానికంటే స్టాక్ మార్కెట్లలోనే ఎక్కువ రాబడిని పొందవచ్చా అనే డౌట్ ఉంటుంది.

అయితే గడచిన 25 ఏళ్ల రాబడుల డేటాను పరిశీలిస్తే ఈ అంశంపై పెట్టుబడిదారులకు ఒక క్లారిటీ తప్పక వస్తుంది. ముందుగా గోల్డ్, నిఫ్టీ లార్జ్ క్యాప్, బాండ్స్ మధ్య ఎందులో పెట్టుబడులు గడచిన కాలంలో ఇన్వెస్టర్లకు మంచి రాబడులను తెచ్చిపెట్టాయనే విషయంపై ఆధారాలతో సహా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ మాట్లాడారు. 

Also Read:-కేంద్రం శుభవార్త.. లాభపడే స్టాక్స్ ఇవే, త్వరపడండి..?

జెరోధా సీఈవో నితిన్ కామత్ ఈ క్రమంలో నిఫ్టీ-50 సూచీతో పోలిస్తే బంగారం 24 ఏళ్ల పనితీరును పరిశీలించారు. పెట్టుబడిదారులకు రాబడిలో వచ్చిన గణనీయమైన వ్యత్యాసాన్ని వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గోల్డ్ 2వేల 024 శాతం రాబడిని అందించగా.. నిఫ్టీ సూచీ మాత్రం వెయ్యి 470 శాతం రాబడిని మాత్రమే అందించగలిగిందని ఇందులో తేలింది. ముఖ్యంగా కరోనా, ఆర్థిక మాంద్యం వంటి అనిశ్చితి సమయాల్లో పసిడి సుస్థిరమైన రాబడిని అందించింది. పైగా గోల్డ్ స్థిరమైన రాబడులతో పెట్టుబడిదారుల సంపదను పెంచింది. 

 

రాబడుల చరిత్రను పరిశీలిస్తే ఆర్థిక ఒత్తిళ్ల సమయంలో నిఫ్టీ 50 గణనీయమైన క్షీణతలను ఎదుర్కొన్నప్పటికీ.. గోల్డ్ మాత్రం స్థిరమైన పెరుగుదలను కొనసాగించిందని, పెట్టుబడిదారులకు అస్థిరతకు వ్యతిరేకంగా నమ్మకమైన హెడ్జ్‌ను అందిస్తుందని ఇందులో వెల్లడైంది. 2024లో నిఫ్టీ లార్జ్ క్యాప్ కేవలం 19 శాతం రాబడిని అందించగా.. గోల్డ్ 25 శాతం రాబడితో ముందు వరుసలో నిలిచింది. అలాగే 2025 నుంచి పరిశీలిస్తే బంగారం పెట్టుబడిదారులకు సగటున 20 శాతం వార్షికంగా రాబడిని అందించింది. 

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇన్వెస్టర్లు భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయటానికి బదులుగా.. డిజిటల్ గోల్డ్ స్కీమ్స్, గోల్డ్ ఈటీఎఫ్ వంటి ప్రత్యామ్నాయాల్లో సులువుగా పెట్టుబడులు పెడుతూ వాటిని నిర్వహిస్తున్నారు. అయితే తాము సరైన సమయంలో గోల్డ్ ఈటీఎఫ్ లాంచ్ చేసినట్లు జెరోధా సీఈవో వెల్లడించారు. ఇన్వెస్టర్లు ప్రస్తుత కాలంలో బంగారంపై అవగాహన పొందటానికి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉత్తమ మార్గమని అన్నారు.