
‘మ్యాస్ట్రో’ తర్వాత నితిన్ నుంచి రాబోతున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కృతీశెట్టి, కేథరీన్ హీరోయిన్స్. ఇందులో సిద్ధార్థ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్‌గా నితిన్ నటిస్తున్నాడు. నిన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు సంబంధించిన అప్‌డేట్‌తో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ‘ఎన్.సిద్ధార్థరెడ్డి గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. తన మొదటి చార్జ్‌ని మార్చి 26న ఉదయం 10:08 నిమిషాలకు తీసుకుంటున్నారు’ అంటూ సినిమా కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ తరహాలో ఫస్ట్ లుక్ విడుదల గురించి చెప్పారు. ఆ ఆర్డరు కాపీ నిండా రక్తపు మరకలు ఉండటం చూస్తుంటే ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై ఆసక్తి కలుగుతోంది. గ్రామాల్లోని అవినీతి రాజకీయాల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆదిత్య మూవీస్‌తో కలిసి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నికితారెడ్డి నిర్మిస్తున్నారు.