అమరన్‌ సినిమా ఫస్ట్ సాంగ్‌‌‌‌ రిలీజ్

అమరన్‌ సినిమా ఫస్ట్ సాంగ్‌‌‌‌ రిలీజ్

శివకార్తికేయన్‌‌‌‌,  సాయిపల్లవి జంటగా  నటించిన  తమిళ చిత్రం ‘అమరన్‌‌‌‌’.  రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. సోనీ పిక్చర్స్‌‌‌‌తో కలిసి కమల్ హాసన్‌‌‌‌, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. హీరో నితిన్‌‌‌‌కు చెందిన  శ్రేష్ట్ మూవీస్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. సోమవారం ఫస్ట్ సాంగ్‌‌‌‌ను నితిన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు.

‘హే రంగులే.. హే రంగులే.. నీ రాకతో లోకమే రంగులై పొంగెనే.. ఇంతలే కేరింతలే.. నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందేనే..’ అంటూ సాగిన మెలోడియస్ సాంగ్‌‌‌‌లో శివ కార్తికేయన్, సాయి పల్లవి క్యారెక్టర్స్  లైఫ్ జర్నీని బ్యూటీఫుల్‌‌‌‌గా చూపించారు.  జీవీ ప్రకాష్ కంపోజ్ చేసిన పాటకు రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాయగా,  అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడిన విధానం ఆకట్టుకుంది. అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో మేజర్‌‌‌‌‌‌‌‌గా శివ కార్తికేయన్, ఆయన భార్య పాత్రలో సాయి పల్లవి నటించారు.