Robinhood Box Office Collection Day1: ఫర్వాలేదనిపించిన రాబిన్ హుడ్... కానీ నితిన్ రేంజ్ కలెక్షన్స్ ఇవి కాదేమో.. 

Robinhood Box Office Collection Day1: ఫర్వాలేదనిపించిన రాబిన్ హుడ్... కానీ నితిన్ రేంజ్ కలెక్షన్స్ ఇవి కాదేమో.. 

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్‌హుడ్ సినిమా శుక్రవారం (మార్చి 28న) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీని వెంకీ కుడుములు తెరకెక్కించాడు. శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ గెస్ట్ రోల్ చేశాడు.  ప్రమోషన్స్, ఈవెంట్స్, సాంగ్స్ తో సినిమాపై మేకర్స్ అంచనాలు పెంచేశారు. కానీ థియేటర్స్ లో మాత్రం ఆశించిన  స్థాయిలో మాత్రం ఆడియన్స్ ని అలరించలేక పోయిందని టాక్. 

Sacnilk సమాచారం ప్రకారం మొదటి రోజు రాబిన్ హుడ్ దాదాపుగా రూ.2 కోట్లు (నెట్) కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా రూ.80 లక్షలు కలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే గతంలో నితిన్ కి మంచి మార్కెట్ ఉండేది. కానీ ఈమధ్య వరుస ఫ్లాపులు పడుతుండటంతో కలెక్షన్స్ రావడం లేదు. అయితే గతంతో పోలిస్తే రాబిన్ హుడ్ కలెక్షన్స్ కొంతమేర బెటర్ అని చెప్పవచ్చు.

ALSO READ | Mad Square Box Office Collection day 1: నాగవంశీ కాన్ఫిడెన్స్... ఊహించని రేంజ్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్..

రాబిన్ హుడ్ స్టోరీ కొంతమేర కిక్, బీస్ట్ సినిమాల స్టోరీలని మిక్స్ చేసినట్లు ఉన్నప్పటికీ డైరెక్టర్ వెంకీ కుడుములు మాత్రం కొత్త ఫ్లేవర్ ని యాడ్ చేస్తూ ట్రెండ్ కి తగ్గట్టుగా చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం దాదాపుఅగా ఫలించిందని చెప్పవచ్చు. అయితే రాబిన్ హుడ్ తో పాటూ రిలీజ్ అయిన 'మ్యాడ్ స్క్వేర్' కూడా పాజిటివ్ టాక్ తో తెచ్చకుని దూసుకుపోతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద 'మ్యాడ్ స్క్వేర్'  రాబిన్ హుడ్ కి గట్టి పోటీ ఇస్తోంది.

అయితే రాబిన్ హుడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపుగా రూ.28.7 కోట్లు పైగా ఉంది. దీంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ తో చిత్ర యూయంట్ కి టెన్షన్ మొదలైంది. కానీ లాంగ్ వీకెండ్ ఉండటంతో టికెట్లు తెగి కలెక్షన్స్ వస్తేమాత్రం నిర్మాతలు సేఫ్ అవుతారు..