Nithin : నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ .. ఎప్పుడంటే

Nithin : నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ .. ఎప్పుడంటే

ఇటీవల ‘రాబిన్‌‌‌‌‌‌‌‌ హుడ్‌‌‌‌‌‌‌‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నితిన్.. త్వరలో ‘తమ్ముడు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ‘వకీల్‌‌‌‌‌‌‌‌ సాబ్‌‌‌‌‌‌‌‌’ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు,  శిరీష్ నిర్మిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌‌‌‌‌‌‌‌.  లయ కీలకపాత్ర పోషిస్తోంది.  అజనీస్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని జులై 4న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అతి త్వరలో ఈ రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 జులై మూడో వారంలో రవితేజ ‘మాస్‌‌‌‌‌‌‌‌ జాతర’, నాలుగో వారంలో చిరంజీవి ‘విశ్వంభర’ విడుదల కానున్న నేపథ్యంలో మూడు వారాల ముందే సోలోగా బరిలోకి దిగబోతున్నాడు నితిన్. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు’ చిత్రం కూడా జులై నెలలోనే విడుదలై మెప్పించింది. పవన్‌‌‌‌‌‌‌‌కు నితిన్ వీరాభిమాని ఆ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ కూడా కలిసొచ్చే అవకాశముంది. ఇక దిల్,  శ్రీనివాస కళ్యాణం చిత్రాల తర్వాత ఈ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నితిన్ నటించిన చిత్రమిది.  ఈ సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ముందే నితిన్ హీరోగా ‘బలగం’ వేణు డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ‘ఎల్లమ్మ’ అనే మరో చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.