అలాంటి వ్యక్తితోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నిత్యా మీనన్

అలాంటి వ్యక్తితోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నిత్యా మీనన్

నటి నిత్యా మీనన్(Nithya menon)​ తన పెళ్లిపై హాట్​ కామెంట్స్​ చేసింది. తనకు కాబోయే వ్యక్తి అందరిలా ఆలోచించేవాడు అయ్యుండకూదని తెలిపింది. అలాగే పెళ్లిపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ‘పెళ్లి అనేది  సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా జరిగే సెటప్​. ఈ రెండూ నాకు అవసరం లేదు. సోషల్​గా, ఫైనాన్సియల్​గా నాకు అవసరమైన సెక్యూరిటీ నేను సంపాదించుకున్నాను. నన్ను కోరుకునే వ్యక్తి ఈ పరిధిని దాటి ఆలోచించగలగాలి.

పెళ్లంటే కేవలం సమాజం కోసమో.. ఆర్థిక సంబంధాలకోసమే అనే విధంగా ఆలోచించేవారు నాకొద్దు. మెచ్యూరిటీతో ఆలోచించే వ్యక్తి దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి గురించి ఆలోచిస్తా’.. అని నిత్యామీనన్​ తెలిపింది. ప్రస్తుతం మాస్టర్​ పీస్​ అనే మలయాళ వెబ్​ సిరీస్​లో ఈ బ్యూటీ నటిస్తోంది.