![ఐక్యరాజ్య సమితిలో వ్యాఖ్యలపై కైలాస ప్రతినిథి క్లారిటీ](https://static.v6velugu.com/uploads/2023/03/Nithyananda_5ZxjlgKJdD.jpg)
ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస శాశ్వత రాయబారి విజయ ప్రియ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. భారత దేశాన్ని తాము గౌరవిస్తామని, గురు పీఠం లాంటిదని చెప్పారు. భగవాన్ నిత్యానంద సాక్షాత్తు పరమ శివం అని పేర్కొన్నారు. ఆయన ఇండియాలోని కొన్ని హిందూ వ్యతిరేక శక్తుల చేత హింసించబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన మాటలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపించాయన్నారు.
అందుకే ఈ విధంగా వివరణ ఇస్తున్నానని ఓ వీడియో ద్వారా విజయ ప్రియ స్పష్టం చేశారు. అంతకుముందు ఆమె భారతదేశంపై తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు. తమను ఇండియా వేధిస్తోందంటూ చేసిన కామెంట్లపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆమె ప్రసంగాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదంటూ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే విజయ ప్రియ ప్రసంగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.