నీతి ఆయోగ్ మెంబర్, ప్రముఖ ఆర్తిక వేత్త అరవింద్ వీరమణి 2025 ఫైనాన్షియల్ ఇయర్ కు జీడీపీ(GDP) గ్రోత్ రేట్ ను గతంలో ఇచ్చిన దానికంటే తగ్గించారు. తాను గతంలో ఇచ్చిన అంచనాల కంటే తక్కువగా ఉంటుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు భారత ఆర్థిక వృద్ధి రేటుపై ప్రభావం చూపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవలే భారత జీడీపీ 6.5-7.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ అమెరికా, చైనా దేశాలలో మారుతున్న సమీకణాల దృష్ట్యా ఇండియా గ్రోత్ రేట్ కాస్త తక్కువగా ఉంటుందని, అది 6.5-7 శాతంగా ఉండనున్నట్లు తెలిపారు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న రాజకీయ, ఆర్థిక కారణాలేనని ఆయన తెలిపారు.
‘‘ఈ ఏడాది నుంచి నా అంచనా ఒకటే ఉండే. 2025 ఫైనాన్షియల్ ఇయర్ కు జీడీపీ 6.5-7.5 శాతంగా ఉంటుందని అంచనా వేశాను. కానీ ఇప్పుడు ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కారణంగా 0.5 శాతానికి తగ్గిస్తున్నాను.’’ అని తెలిపారు. ముఖ్యంగా యూఎస్ ఎలక్షన్స్ కారణంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని, దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని అన్నారు.
అందులో భాగంగానే యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటం, రూపాయి విలువ పతనం ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ అనిశ్చితితో ఏర్పడినవేనని తెలిపారు.