దళిత బంధు పథకం పై నీతి అయోగ్ కమిటీ సభ్యులు ప్రశంసలు కురిపించారు. హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు తీరును విశ్వనాథ్ బిష్ణయ్ నేతృత్వంలో నీతి అయోగ్ బృందం పరిశీలించింది. లబ్దిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను నీతి అయోగ్ కమిటీ పరిశీలించింది. దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం అర్హులైన దళితులకు రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం శుభపరిణామని తెలిపారు.
పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా ఉపాధి కల్పించేందుకు దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడంలో ఈ పథకం ఉపయోగపడుతుందని నీతి అయోగ్ సభ్యులు పేర్కొన్నారు. సమాజంలో దళితులు తమ కాళ్ళ మీద తాను నిలబడేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దళితుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ఈ పథకం చాలా బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు కుమార్ జైన్, నిఖిత జాయిన్, యశస్విన్ సరస్వతి, ఇరామయీ, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి సురేష్, జిల్లా నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.