ND స్టూడియోస్‌లో నితిన్ దేశాయ్ అంత్యక్రియలు

జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని తన స్టూడియోలో ఆగస్టు 2న శవమై కనిపించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం JJ ఆసుపత్రికి పంపినట్టు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్‌డీ స్టూడియోస్‌లో నితిన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రాయ్‌ఘడ్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) సోమనాథ్ ఘర్గే తెలిపారు.  

ALSO READ:నేషనల్ అవార్డ్ ఆర్ట్‌ డైరెక్టర్‌ సూసైడ్?

“నితిన్ దేశాయ్ మృతదేహం ND స్టూడియోస్‌లో కనుగొన్నాం. ఆయన ఆకస్మిక మృతిపై ఖలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీనిపై విచారణ చేస్తున్నాం. ఆయన అంత్యక్రియలు ఎన్‌డీ స్టూడియోస్‌లో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నితిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించారు. లొకేషన్ లో మొబైల్ ఫోన్‌లు, ఇతక ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా పలు పరికరాలు స్వాధీనం చేసుకున్నాం. వాటిని పరిశీలిస్తున్నాము. మేము అతని కేర్‌టేకర్, డ్రైవర్ వాంగ్మూలాన్ని కూడా తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం" అని సోమనాథ్ అన్నారు.

నితిన్ దేశాయ్ రికార్డ్ చేసిన 11 ఆడియో క్లిప్‌లు

దేశాయ్.. సౌండ్ రికార్డర్‌లో రికార్డ్ చేసిన మొదటి వాక్యం 'లాల్‌బాగ్ కే రాజా కో మేరా అంతిమ్ ప్రాణం' అని సమాచారం. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ రికార్డ్ చేసిన మొత్తం 11 ఆడియో క్లిప్‌లు ఎన్‌డీ స్టూడియో నుంచి పోలీసులకు అందాయి. ఇప్పుడు వాటిని విశ్లేషించి పోలీసులు తదుపరి దర్యాప్తు చేయనున్నారు. నితిన్ దేశాయ్ రాత్రి ND స్టూడియోకి వెళ్ళినప్పుడు, అతను తన బంగ్లా చుట్టూ ఎవరూ తిరగవద్దని తన ఉద్యోగిలో ఒకరికి చెప్పినట్టు సమాచారం. అలాగే తాను చేసిన ఆడియో లేదా సౌండ్ రికార్డింగ్ ను తన సోదరికి వినిపించి ఇవ్వాలని కోరాడు. నితిన్ దేశాయ్ ఈ ఆడియో క్లిప్‌లో కొందరి పేర్లను కూడా ప్రస్తావించారు. పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు.

ALSO READ:ఆ రూ.252 కోట్ల అప్పు వల్లేనా.. సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్యలో ట్విస్ట్