ఐదేళ్లలో ఇండియా ఆటో ఇండస్ట్రీ నెంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌ : నితిన్ గడ్కరీ

  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 

న్యూఢిల్లీ: ఇండియా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఇంకో ఐదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌‌‌‌ పొజిషన్‌‌‌‌కు చేరుకుంటుందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఇండస్ట్రీ ఇప్పటికే  4.5 కోట్ల ఉద్యోగాలను ఇచ్చిందని తెలిపారు. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా)  నిర్వహించిన ఓ ఈవెంట్‌‌‌‌లో ఆయన పాల్గొన్నారు. ఇండియాలో తయారైన బండ్లకు గ్లోబల్‌‌‌‌గా మంచి డిమాండ్ ఉందని అన్నారు. ‘ఇండియా వెహికల్ ఇండస్ట్రీ సైజ్ ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లుగా ఉంది. 

ఇంకో ఐదేళ్లలో రూ.78 లక్షల కోట్ల మార్క్‌‌‌‌ను దాటుతుందని నమ్ముతున్నాను’ అని ఆయన వివరించారు. రూ.78 లక్షల కోట్ల మార్కెట్ సైజ్‌‌‌‌తో యూఎస్ మొదటి ప్లేస్‌‌‌‌లో ఉండగా, రెండో ప్లేస్‌‌‌‌లో రూ.47 లక్షల కోట్లతో చైనా ఉంది.  ఇండియా ఆటోమొబైల్‌‌‌‌ ఇండస్ట్రీ సైజ్‌‌‌‌ పదేళ్ల కిందట రూ.7.5 లక్షల కోట్లుగా ఉండేది. ఈ ఇండస్ట్రీ  రాష్ట్ర ప్రభుత్వాలకు  ఎక్కువ జీఎస్‌‌‌‌టీ చెల్లిస్తోందని గడ్కరీ అన్నారు. ఇండియాలో తయారవుతున్న టూవీలర్లలో 50 శాతం ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. 

14.08 లక్షల ఎలక్ట్రిక్ బండ్లు అమ్ముడయ్యాయి..

కిందటేడాది ఇండియాలో 14.08 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని కేంద్ర మంత్రి హెచ్‌‌‌‌డీ కుమారస్వామి అన్నారు. అమ్ముడైన మొత్తం బండ్లలో వీటి వాటా ఏడాది ప్రాతిపదికన 4.44 శాతం నుంచి  5.59 శాతానికి పెరిగిందని వివరించారు. గ్లోబల్‌‌‌‌గా సమస్యలున్నా, దేశ ఆటో ఇండస్ట్రీ గ్రోత్ నమోదు చేసిందని, కిందటేడాది మొత్తంగా 2.61 కోట్ల బండ్లు అమ్ముడయ్యాయని, 9 శాతం గ్రోత్ నమోదయ్యిందని ఫాడా ఈవెంట్‌‌‌‌లో ఆయన పేర్కొన్నారు.