బిహార్ లోని సుల్తాన్ గంజ్ లో గంగా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఇటీవలే కూలింది. అయితే దీనిపై స్థానిక ఐఏఎస్ అధికారి అందజేసిన రిపోర్టు చూసి షాక్ అయినట్లు తెలిపారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. బలమైన గాలులు వీయడం వల్లే బ్రిడ్జ్ కూలినట్లు ఐఏఎస్ అధికారి రిపోర్ట్ ఇచ్చారన్నారు నితిన్ గడ్కరీ. బలమైన గాలులు వీస్తే బ్రిడ్జ్ ఎలా కూలుతుందో అర్థం కావట్లేదన్నారు గడ్కరీ. బిహార్ లో ఏప్రిల్ 29న బ్రిడ్జ్ కూలిందని... దానిపై ఐఏఎస్ వివరణ షాకింగ్ గా ఉందన్నారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటివి ఎలా నమ్ముతారో అర్థం కావట్లేదన్నారు. గట్టిగా గాలి వీస్తే బ్రిడ్జ్ కూలుతుందా.... ఏదో తప్పు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు గడ్కరీ. క్వాలిటీ లోపం లేకుండా తక్కువ ఖర్చుతో మన్నికైన నిర్మాణాలు చేపట్టాలన్నారు గడ్కరీ. రూ. 1710 కోట్లతో సుల్తాన్ గండ్, అగౌనీ ఘాట్ల మధ్య 3 వేల 116 మీటర్ల పొడవుతో.. 2014లో బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది.
#WATCH...I don't understand how can a bridge collapse due to strong winds, there must be some fault...We must aim for perfection without compromising quality...: Union Roads & Transport Minister Nitin Gadkari on the bridge collapse in (Sultanganj), Bihar (09.05) pic.twitter.com/riWGKq3YxL
— ANI (@ANI) May 10, 2022