Road Safety: గడ్కరీ షాకింగ్ నిర్ణయం.. ఇక బైక్ కొంటే రెండు హెల్మెట్స్

Road Safety: గడ్కరీ షాకింగ్ నిర్ణయం.. ఇక బైక్ కొంటే రెండు హెల్మెట్స్

Nitin Gadkari: భారత ప్రభుత్వం దేశంలో నిరంతరం రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు, వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కొన్ని మార్పులను కూడా తీసుకొస్తోంది. 

కేంద్ర రోడ్డు రవాణా అండ్ హైవేస్ మంత్రి నితిన్ గడ్కర్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. దీని ప్రకారం ఇకపై దేశంలో టూవీలర్లను ఖచ్చితంగా ఐఎస్ఐ సర్టిఫికేషన్ కలిగిన రెండు హెల్మెంట్లతో కలిపి విక్రయించాలని పేర్కొన్నారు. ఇదే అమలులోకి వస్తే ద్విచక్రవాహం కొనే వ్యక్తులకు బండి డెలివరీతో పాటు రెండు హెల్మెట్లు తప్పనిసరిగా అందించబడతాయి. కేంద్ర మంత్రి గడ్కరీ ఈ విషయాన్ని దిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ ప్రతిపాదనను దేశంలోని టూవీరల్స్ హెల్మెట్ తయారీదారుల అసోసియేషన్ స్వాగతించింది.

రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గడ్కరీ ఆదేశం కీలకమైనదిగా తెలుస్తోంది. దేశంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించటానికి ఇది దోహదపడే చర్యగా ఆటో రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణాలు కలిగిన హెల్మెంట్లను వాహనదారులు ఉపయోగించేలా ఇది ప్రేరేపిస్తుందని హెల్మెట్ తయారీదారుల సంఘం అభిప్రాయపడింది. 

Also Read :- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 2 శాతం పెంపు

వాస్తవానికి ఈ చర్య జాతీయ అవసరమని హెల్మెట్ తయారీ సంఘం అభిప్రాయపడింది.  ప్రమాదాల్లో ప్రజలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు - చిన్న కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రులు- ఈ ఆదేశం భవిష్యత్తులో ఇటువంటి నష్టాలను నివారించవచ్చనే ఆశను కలిగిస్తుందని సంఘం అధ్యక్షుడు రాజీవ్ కపూర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాణాల గణాంకాలను పరిశీలిస్తే ఏటా 4 లక్షల 80 వేల వరకు ఉన్నాయి. వీటిలో దాదాపు లక్ష 88 వేల మంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటలు ఉన్నాయి. పైగా వీటి మెుత్తంలో 66 శాతం ప్రమాదాల్లో 18 నుంచి 45 ఏళ్ల వయస్సు మధ్య వారే ఉండటం బాధాకరం. ద్విచక్రవాహన ప్రమాదాల్లో 50 శాతానికి పైగా మరణాలు హెల్మెట్ లేకపోవటం వల్లనే జరుగుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 

ద్విచక్ర వాహన ప్రయాణాలు ఇకపై ప్రమాదకరంగా ఉండకూడదని నితిన్ గడ్కర్ తాజా ప్రకటన నొక్కి చెబుతోంది. వాహనాన్ని నడిపే సమయంలో రైడర్, వెనకాల కూర్చున్న పిలియన్ ఇద్దరూ ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణాలతో తయారైన హెల్మెట్ ధరించటం వల్ల అనుకోకుండా ప్రమాదం జరిగిన సందర్భంలో తలకు పెద్ద గాయాలు కావటం నుంచి తప్పించుకోవచ్చని, తద్వారా మరణాల సంఖ్యను రోడ్డు ప్రమాదాల్లో తగ్గించవచ్చని టూవీరల్స్ హెల్మెట్ తయారీదారుల అసోసియేషన్ సూచిస్తోంది. కేంద్ర రవాణా మంత్రి దేశంలో వాహన భద్రతకు బలమైన న్యాయవాదిగా ఉన్నారని సంఘం వెల్లడించింది.