అమెజాన్‌ సాయంతో చిన్న కంపెనీలు దున్నేస్తున్నాయి

అమెజాన్‌ సాయంతో చిన్న కంపెనీలు దున్నేస్తున్నాయి

అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌పై మన ఎంఎస్‌ఎంఈ సేల్స్‌ రూ. 30 వేలకోట్ల

న్యూఢిల్లీ: తమ గ్లోబల్‌‌ సెల్లింగ్‌‌ ప్రోగ్రామ్ (జీఎస్‌‌పీ) ద్వారా దేశంలోని చిన్న పరిశ్రమలు(ఎంఎస్‌‌ఎంఈలు), బ్రాండ్లు గ్లో బల్‌‌గా రెండు బిలియన్‌‌ డాలర్ల‌ (రూ. 30 వేల కోట్ల) విలువైన ఎగుమతులను జరిపాయని ఈ–కామర్స్ ‌ కంపెనీ అమెజాన్ ‌సోమవారం ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎగుమతులు జరిగాయి. ఈ ప్రోగ్రామ్‌ను అమెజాన్‌‌ 2015 లో స్టార్ట్‌‌ చేసింది. తన 15 వెబ్‌సైట్ల ద్వారా గ్లోబల్‌‌ మార్కె ట్లలో ఇండియన్‌‌ మైక్రో, స్మాల్‌‌, మీడియం కంపెనీలు తమ ప్రొడక్లనుట్‌ అమ్ముకోవడానికి వీలు కల్పించింది. అమెజాన్ ‌జీఎస్‌‌పీ ప్రోగ్రామ్‌ మొదట కొన్ని వందల మంది సెల్లర్ల‌తోనే స్టార్ట్ ‌‌ అయ్యింది. ప్రస్తుతం ఈప్రోగ్రామ్ ద్వారా 60,000మంది సెల్లర్లు తమ ప్రొడక్లనుట్ ‌గ్లోబల్‌‌ మార్కెట్లో అమ్ముతున్నారు.

2025 నాటికి జీఎస్‌‌పీ ప్రోగ్రామ్‌‌ ద్వారా మొత్తంగా10బిలియన్ ‌డాలర్ల విలువైన ఎగుమతులు జరపాలని కంపెనీ టార్గెట్‌‌ గా పెట్టుకుంది. ఇండియన్‌‌ ఎకానమీకి ఎంఎస్‌‌ఎంఈలు కీలకమని అమెజాన్‌‌ ఇండియా సీనియర్‌‌‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ అమిత్‌‌ అగర్వాల్ ‌‌అన్నారు. వీటిని ఆన్‌‌లైన్‌‌లోకి తీసుకువచ్చి దేశ ఎగుమతులు పెరగడానికి, జాబ్స్‌‌ క్రియేషన్‌‌కు అమెజాన్‌‌ సాయపడుతోందని పేర్కొన్నారు. గ్లోబల్‌‌ లెవెల్‌‌కు తీసుకువెళడానికి, గ్లోబల్‌‌ బ్రాండ్స్‌‌గా ఎంఎస్ఎంఈల ప్రొడక్లనుట్‌‌ తీర్చిదిద్దడానికి జీఎస్‌‌పీ ప్రోగ్రామ్‌ ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఒక బిలియన్‌‌ డాలర్ల విలువైన ఎగుమతులను చేయడానికి ఈ ప్రోగ్రామ్‌‌కు మూడేళ్ల టైమ్‌ పట్టిందని, మరో బిలియన్‌‌ డాలర్ల ఎగుమతులను కేవలం 18నెలల్లోనే సాధించామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం