
దుబాయ్: ఇండియా అంపైర్ నితిన్ మీనన్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లోనే కొనసాగనున్నాడు. ఈ మేరకు ఐసీసీ 2025–26 ఏడాదికి అంపైర్ల లిస్ట్‌ను విడుదల చేసింది. ఇండియాకే చెందిన జయరామన్ మదన్‌గోపాల్ ఎమర్జింగ్ ప్యానెల్‌కు ప్రమోట్ అయ్యాడు. దీంతో విదేశాల్లో జరిగే టెస్ట్, వన్డేల్లో అంపైరింగ్ చేయనున్నాడు.
ఇప్పటి వరకు మదన్‌గోపాల్ ఒక టెస్ట్, 22 వన్డేలు, 42 టీ20ల్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఎలైట్ ప్యానెల్‌లో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ తర్వాత నితిన్ మీనన్ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. కొత్తగా అల్లాహుద్దీన్ పాలేకర్ (సౌతాఫ్రికా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్)ను ఎలైట్ ప్యానెలోకి తీసుకున్నారు. పాలేకర్ 4 టెస్ట్‌లు, 23 వన్డేలు, 67 టీ20లకు అంపైర్‌గా వ్యవహరించాడు.