చాలా సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయి మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నితిన్. ‘మాచర్ల నియోజకవర్గం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. ఎడిటర్ ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కేథరీన్ థ్రెసా, కృతీశెట్టి హీరోయిన్స్. నిన్న ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని పనులు పెండింగ్ ఉండటంతో వాయిదా వేసిన మేకర్స్, ఇప్పుడు కొత్త డేట్‌ని ప్రకటించారు. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. వీకెండ్‌తో పాటు సోమవారం ఇండిపెండెన్స్ డే కూడా కలసి రావడంతో మూవీకి ప్లస్ అవుతుందని భావించి ఈ డేట్‌ను ఫిక్స్ చేశారట. ఇందులో నితిన్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. రాజ్‌కుమార్ ఆకెళ్ళ సమర్పణలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్గా వక్కంతం వంశీ డైరెక్షన్లో ఓ మూవీ స్టార్ట్ చేశాడు నితిన్. ప్రస్తుతం ఫారిన్లో షూటింగ్ జరుగుతోంది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
నయా ప్లాన్
- టాకీస్
- May 9, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా కూల్చివేతలు..
- SA vs PAK: పాకిస్థాన్‌పై సఫారీ బ్యాటర్ పంజా.. డబుల్ సెంచరీతో విధ్వంసం
- బాలయ్య కూతురికి స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ ఆఫర్... కానీ ఒప్పుకోలేదట..
- ZIM vs AFG: జింబాబ్వే క్రికెటర్ క్రీడాస్ఫూర్తి.. అంపైర్ నాటౌట్ ఇచ్చినా వెళ్ళిపోయాడు
- హైదరాబాద్ లో దారుణం: అనారోగ్యంతో మరణించిన తల్లి.. తట్టుకోలేక ఉరేసుకున్న కొడుకు..
- గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ పెట్టుకోండి: తెలంగాణ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
- తండేల్ నుంచి నమో నమఃశివాయ సాంగ్ రిలీజ్... సాయిపల్లవి డ్యాన్స్ సూపర్..
- ఒక్క చీర ఇచ్చి.. 100 సార్లు చెప్పుకున్నరు.. బీఆర్ఎస్పై మంత్రి సీతక్క ఫైర్
Most Read News
- ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారదర్శనం.. కోటి పుణ్యాల ఫలం..
- డీమార్ట్ బయట కాల్పుల కలకలం.. 5 రౌండ్లు కాల్చారు.. భయంతో వణికిపోయిన కస్టమర్లు
- జనవరి 4న హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
- అనుమతుల్లేకుండా 9 అంతస్తుల అక్రమ నిర్మాణం !
- Good Health:ఇవి తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .. ఆరోగ్యంగా ఉంటారు..
- నెలకు రూ.10 వేలతో 5 ఏండ్లలో రూ.13 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యుచువల్ ఫండ్..
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
- Apple iPhones: 2025లో వస్తున్న ఐదు యాపిల్ ఐఫోన్స్.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- రైతు భరోసా 5 ఎకరాల సాగు భూములకే ఇవ్వాలి..సీఎంకు ఎఫ్‌జీజీ లేఖ
- తెలంగాణ జనాభాలో 55 శాతం బీసీలే.. కులగణన సర్వేలో వెల్లడి?