
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల రూపొందించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. తాజాగా భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
‘రాబిన్ హుడ్’ చిత్రం ఎవర్నీ డిజప్పాయింట్ చేయదని నితిన్ అన్నాడు. అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని శ్రీలీల చెప్పింది. ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకుంటుందని దర్శకుడు వెంకీ కుడుముల అన్నాడు.
నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ ‘నేను ఇదే కాలేజ్‌లో చదువుకున్నా. ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.