రెట్టింపు వినోదంతో రాబిన్‌‌హుడ్‌‌ : నితిన్

రెట్టింపు వినోదంతో రాబిన్‌‌హుడ్‌‌ : నితిన్

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘రాబిన్‌‌హుడ్‌‌’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 28న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. నితిన్ మాట్లాడుతూ ‘మార్చి 30న నా పుట్టినరోజు. దర్శకుడు వెంకీ ఈ చిత్రం ద్వారా నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నాడు. ఈసారి ‘రాబిన్‌‌హుడ్‌‌’ సక్సెస్‌‌ పార్టీ, నా బర్త్ డే పార్టీ కలిపి సెలబ్రేట్‌‌ చేసుకోబోతున్నా. అంత కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాం. ఛలో, భీష్మ చిత్రాల్లో ఉన్న ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌కు డబుల్‌‌ ఇందులో ఉంది. 

ఇది వెంకీ 3.0. ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌తో పాటు కథ, స్క్రీన్‌‌ప్లే, ఎమోషన్‌‌ అత్యద్భుతంగా రాశాడు. క్లైమాక్స్‌‌ చూశాక వావ్ అంటారు. ఇక నేను, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కాంబినేషన్‌‌లో వచ్చే సీన్స్‌‌ హిలేరియస్‌‌గా నవ్వుతారు. క్లీన్‌‌, ఆర్గానిక్‌‌ కామెడీతో వస్తున్నాం’ అని చెప్పాడు.  ఇందులో నటించాక తను హీరోగా నటించిన పాత సినిమాల రోజులు గుర్తొచ్చాయని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 

ఇలాంటి ఓ చక్కని ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో నటించడం సంతోషంగా ఉందని శ్రీలీల చెప్పింది. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని కాన్ఫిడెంట్‌‌గా చెప్పగలను. ఈ సినిమా విజయం సాధిస్తే అది నా టీమ్ అందరికీ చెందుతుంది. ప్రతికూల ఫలితం వస్తే దానికి కారణం నేను అవుతాను’ అని చెప్పాడు. నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ హిలేరియస్‌‌ ఎంటర్‌‌‌‌టైన్మెంట్, చక్కని స్టోరీ, పాటలు, యాక్షన్‌‌ సీన్స్‌‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా కాబోతోంది’ అని తెలిపారు.