రాబిన్‌‌హుడ్‌‌ పై కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాం : నితిన్

రాబిన్‌‌హుడ్‌‌ పై కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాం : నితిన్

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల రూపొందించిన  చిత్రం  ‘రాబిన్‌‌హుడ్‌‌’.  ఆస్ట్రేలియన్  క్రికెటర్ డేవిడ్ వార్నర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమా మార్చి 28న విడుదల  కానుంది. ఆదివారం ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  తన పేరు రామ్ అని ఏజెన్సీకి తగ్గట్టు రాబిన్‌‌హుడ్‌‌ అని మార్చేసుకుంటానని నితిన్ తన పాత్రను పరిచయం చేయడంతో మొదలైన ట్రైలర్ కంప్లీట్ హిలేరియస్‌‌గా సాగింది.  డబ్బున్న  వాళ్ల ఇళ్లను టార్గెట్‌‌గా  చేసుకుని, మారువేషాల్లో దోపిడీలు చేసే మోడరన్ రాబిన్‌‌ హుడ్‌‌గా నితిన్ కనిపించిన తీరు ఆకట్టుకుంది.  బిలీయర్ డాటర్ నీరా వాసుదేవ్‌‌గా శ్రీలీల స్టైలిష్‌‌గా కనిపించింది. 

రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ డైలాగ్స్  ఎంటర్‌‌‌‌టైన్ చేసేలా ఉన్నాయి. జీవీ ప్రకాష్​ కుమార్ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు డేవిడ్ వార్నర్ హాజరై టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. నితిన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాం. శ్రీలీలతో హిట్ పెయిర్‌‌‌‌గా పేరొస్తుందని నమ్ముతున్నా. ఇదిదా సర్‌‌‌‌ప్రైజ్ సాంగ్‌‌తో కేతిక శర్మ ఇంప్రెస్ చేస్తుంది. 

వెంకీతో ఇది రెండో సినిమా. డేవిడ్ వార్నర్ పాత్ర చిన్నదైనా చాలా ఇంపాక్ట్ ఉంటుంది.  మైత్రీ బ్యానర్‌‌‌‌లో వర్క్ చేయడం హ్యాపీ’ అని అన్నాడు.  ‘ఇది  అనుకోకుండా చేసిన సినిమా.  కానీ నేను అనుకున్న దానికంటే బాగా వచ్చిన  సినిమా’ అని   శ్రీలీల చెప్పింది.   ఆడియెన్స్ ఈ సినిమాతో కచ్చితంగా ఎంటర్‌‌‌‌టైన్ అవుతారని డైరెక్టర్ వెంకీ కుడుముల అన్నాడు.  ఇదొక కంప్లీట్ ఎంటర్‌‌‌‌టైనర్ అని, ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేసేలా ఉంటుందని నిర్మాతలు అన్నారు. హీరోయిన్ కేతిక శర్మ, నటులు రాజేంద్ర ప్రసాద్,  దేవ దత్తా, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.