
మరో వారం రోజుల్లో ఐపీఎల్-2025 ఫీవర్ మొదలు కాబోతోంది. అన్ని టీమ్ లు తమ ప్లేయర్స్ ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే తమ తమ హోమ్ గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా ఉప్పల్ స్టేడియంలో చెమటోడ్చుతోంది. ఈ టైమ్ లో SRH కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.
ఫిట్ నెస్ టెస్ట్ కోసం ఇప్పటి వరకు ప్రాక్టీస్ కు దూరంగా ఉన్న హైదరాబాద్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నుంచి స్కాడ్ లో చేరిపోవచ్చునని పచ్చజెండా ఊపింది. తాజాగా బెంగళూరులో నిర్వహించిన యోయో టెస్ట్ లో పాస్ అయ్యాడు నితీశ్. శనివారం నిర్వహించిన ఫిట్ నెస్ టెస్ట్ లో పాస్ అవ్వడంతో ఈ ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ నుంచే నితీశ్ కుమార్ హైదరాబాద్ కు ఆడనున్నాడు.
ఈ సీజన్ లో SRH తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ (RR) ఆడనుంది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో మార్చి 23 న స్టార్ట్ అయ్యే ఈ మ్యాచ్ కి ఈ ఆల్ రౌండర్ వస్తున్నాడు. అయితే ఆదివారం (మార్చి 16) ఉప్పల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ కు అటెండ్ అవుతాడని మేనేజ్ మెంట్ ప్రకటించింది.
శుక్రవారం నితీశ్ కు బెంగళూరులో యోయో టెస్ట్ నిర్వహించింది బీసీసీఐ. ఈ టెస్ట్ లో పాసయ్యాడు ఈ ఆల్ రౌండర్. అయితే ఇటీవల నితీశ్ కు మూడు వారాల రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. మరో 15 రోజులు ఎక్కువ తీసుకున్న నితీశ్.. తాజా టెస్ట్ లో పాసవ్వడంతో SRH బౌలింగ్ కు స్కాడ్ కు మరింత బలాన్ని చేకూర్చినట్లు అయ్యింది.
Also Read:-ఇవాళ(మార్చి15).. డబ్ల్యూపీఎల్ ఫైనల్ ఫైట్
గత సీజన్ లో నితీశ్ చేసిన అద్భుత పర్ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకుని SRH మేనేజ్ మెంట్ రిటైన్ చేసుకుంది. మొత్తం 5 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే.. అందులో నితీశ్ కూడా ఒకరు. పాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ లతో పాటు మన హైదరాబాదీ ఆల్ రౌండర్ ను కూడా రిటైన్ చేసుకుంది మేనేజ్ మెంట్.
ఐపీఎల్ - 2024 లో సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన నితీశ్.. SRH కు చాలా వాల్యుయేబుల్ ఆల్ రౌండర్ గా నిలిచాడు. గత సీజన్ లో 15 మ్యాచ్ లలో 142.92 స్ట్రైక్ రేట్ తో 303 రన్స్ చేసి ఫ్యూచర్ లో తన అవసరం ఎంతుందే చెప్పకనే చెప్పాడు.
వీటితో పాటు బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తో ఆడిన T20లలో కూడా బౌలింగ్, బ్యాటింగ్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసి.. ఇండియాకు తన అవసరం ఉందని నిరూపించుకున్నాడు. ఇండియా ఫ్యూచర్ ప్లాన్స్ లో నితీశ్ కు చోటు ఉంటుందనేలా మేనేజ్ మెంట్, సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. తాజాగా ఫిట్ నెస్ టెస్ట్ లో పాసై మళ్లీ టీమ్ లో చేరుతుండటంతో మన ఆల్ రౌండర్ ఈసారి తన విశ్వరూపం చూపిస్తాడని అనుకుంటున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్.