IND vs AUS: ఇదీ తెలుగోడి సత్తా.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన నితీష్ రెడ్డి

ఆస్ట్రేలియా గడ్డపై నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడుతుంది ఆస్ట్రేలియా లాంటి ఛాలెంజింగ్ పిచ్ లు అయినప్పటికీ బ్యాటింగ్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్ ల్లో నితీష్ నిలకడగా బ్యాటింగ్ చేయడం విశేషం. తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ ల్లో నితీష్ 3 సార్లు టాప్ స్కోరర్ కావడం విశేషం. ఇదిలా ఉంటే తెసులుగు కుర్రాడు హిట్టింగ్ చేయడంలోనూ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆస్ట్రేలియా లాంటి అతి పెద్ద గ్రౌండ్ లలో సిక్సర్లు కొట్టడం సామాన్యమైన విషయం కాదు. కానీ నితీష్ అలవోకగా సిక్సర్లు బాదేస్తున్నాడు. 

ALSO READ | ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌‌‌‌‌‌‌‌ చేసే బాధ్యత బుమ్రా ఒక్కడి పైనే ఉండదు: రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ

ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు బాదేశాడు. దీంతో ఆస్ట్రేలియా టూర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నితీష్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. 2003-24 సీజన్ లలో సెహ్వాగ్ 6 సిక్సర్లు కొట్టాడు. మురళి విజయ్ 2014-15 టూర్ లో 6 సిక్సర్లతో సెహ్వాగ్ తో సమంగా ఉన్నాడు. నితీష్ 2 టెస్టులకే ఈ రికార్డ్ బ్రేక్ చేయడం విశేషం. రానున్న మూడు టెస్టుల్లో ఇంకొన్ని సిక్సర్లు కొట్టి తన రికార్డ్ ను పదిల పరచుకునే అవకాశం ఉంది. 

ALSO READ | హెడ్‌‌‌‌‌‌‌‌ చెప్పింది అబద్ధం: సిరాజ్‌‌‌‌‌‌‌‌

ఇటీవలే ముగిసిన అడిలైడ్ టెస్టులో బ్యాటింగ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో  రాణించిన ఒకే ఒక్క ఆటగాడు.. నితీష్ రెడ్డి. ప్రత్యర్థి బౌలర్ల దాటికి టాఫార్డర్‌ బ్యాటర్లు విఫలమైనా.. నేనున్నానంటూ తెలుగోడు కష్టకాలంలో జట్టును ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో నితీశ్‌ ఇన్నింగ్స్‌ ఎంతో విలువైనదే. 42 పరుగుల చొప్పున ఇరు ఇన్నింగ్స్ లలోనూ ఒకే పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చి ఉంటే నితీష్ కుమార్ రెడ్డి భారీ స్కోర్ చేసేవాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.