ముంబై: తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇండియా–ఎ టీమ్‌కు ఎంపికయ్యాడు. మెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ కోసం సెలెక్ట్ చేసిన జట్టులో ఏపీ కుర్రాడు చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 13 నుంచి 23 వరకు కొలంబో వేదికగా వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ కోసం ఆలిండియా జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం టీమ్‌ను ప్రకటించింది.
అండర్19 వరల్డ్ కప్ స్టార్ యశ్ ధూల్‌కు కెప్టెన్సీ అప్పగించిన కమిటీ డొమెస్టిక్, ఐపీఎల్లో సత్తా చాటిన సాయి సుదర్శన్, అభిషేక్ శర్మతో పాటు రియాన్ పరాగ్, నిశాంత్ సింధు తదితరులను తీసుకుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు రెండు గ్రూపుల్లో పోటీ పడుతాయి. ఇండియా, నేపాల్, యూఏఈ, పాకిస్తాన్ గ్రూప్–బిలో ఉండగా, ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గాన్, ఒమన్ గ్రూప్–ఎలో నిలిచాయి.