ముంబై: టీమిండియా క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. శుక్రవారం నెట్ సెషన్ సందర్భంగా అతను పక్కటెముకల నొప్పికి గురయ్యాడు.
దాంతో మిగిలిన సిరీస్ నుంచి తప్పుకున్నాడని బీసీసీఐ శనివారం ప్రకటించింది. నితీశ్ స్థానంలో ముంబై ఆల్‌రౌండర్ శివం దూబే జట్టులోకి వచ్చాడు. మరోవైపు తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా వెన్ను నొప్పికి గురైన రింకూ సింగ్ ఇంగ్లండ్‌తో రెండో టీ20తో పాటు మూడో మ్యాచ్‌కు దూరమవగా, అతనికి కవర్‌గా రమణ్‌దీప్ సింగ్ జట్టులో చేరాడు.