IND vs ENG: అభిషేక్ మెంటల్ నా.. ధనాధన్ ఇన్నింగ్స్‌పై నితీష్ కామెంట్స్ వైరల్

IND vs ENG: అభిషేక్ మెంటల్ నా.. ధనాధన్ ఇన్నింగ్స్‌పై నితీష్ కామెంట్స్ వైరల్

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ పై తుఫాన్ ఇన్నింగ్స్ తో హోరెత్తించాడు. ఆదివారం (ఫిబ్రవరి 2) వాంఖడే వేదికగా జరిగిన చివరి టీ20లో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ శివాలెత్తాడు. కొడితే ఫోర్, లేకపోతే సిక్సర్ అన్నటుగా అభిషేక్ ఇన్నింగ్స్ సాగింది. మ్యాచ్ లైవ్ చూస్తున్నామా.. హైలెట్స్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. 54 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 13 సిక్స్‌‌లతో 135 పరుగులు చేసి టీ20 క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.

17 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 37 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న ఈ పంజాబీ వీరుడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ ఇన్నింగ్స్ కు ప్రపంచ క్రికెట్ మొత్తం ఫిదా అయింది. ప్రపంచ క్రికెట్ మొత్తం అభిషేక్ శర్మను పొగుడుతుంటే తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి మాస్ జోడించి అతని ఇన్నింగ్స్ ను హైలెట్ చేశాడు. తన ఇంస్టాగ్రామ్ లో "మెంటల్ నా కొడుకు" అని రాసుకొచ్చాడు. పైన సాలార్ లోని ప్రభాస్ ఫోటోని.. కింద అభిషేక్ శర్మ ఫోటోను షేర్ చేశాడు. ఇది అభిషేక్ శర్మ ఊర మాస్ ఇన్నింగ్స్ అని చెప్పడం విశేషం. 

Also Read : ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ భారీ నజరానా

అభిషేక్ శర్మ,నితీష్ రెడ్డికి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఇద్దరు ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున ఆడి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. 2025 ఐపీఎల్ లో మరోసారి కలిసి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరూ ఐపీఎల్ లో అదరగొట్టి 2024లో భారత జట్టులో స్థానం సంపాదించారు. ఓ వైపు ఓపెనర్ గా అభిషేక్ అదరగొడుతుంటే.. మరోవైపు నితీష్ ఆల్ రౌండర్ గా సత్తా చాటుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న వీరిద్దరూ భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నారు. 

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో టీమిండియా 150 రన్స్‌‌ తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 4–1తో సొంతం చేసుకుంది. టాస్‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 247/9 స్కోరు చేసింది. భారీ ఛేజింగ్‌‌లో ఇంగ్లండ్‌‌ 97 పరుగులకే ఆలౌట్ అయింది. అభిషేక్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి.