బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్

 బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్

బిహార్‌కు ప్రత్యేక హోదా/ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనతాదళ్ (యునైటెడ్) జాతీయ కార్యవర్గం తీర్మానించింది. NDA ప్రభుత్వంలో జేడీయూ కీలకమైన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం నితీశ్ కుమార్ NDAతోనే ఉంటారని ఆ పార్టీ స్పష్టం చేసింది.  నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, జెడి(యు) నేతలతో సహా అన్ని పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.  

బిహార్‌కు ప్రత్యేక హోదా  ఇవ్వాలని సీఎం నితీష్‌కుమార్‌ దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.   ప్రత్యేక హోదా సాధించడం వల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల రాబడిలో రాష్ట్ర వాటా పెరుగుతుంది. కాగా ఎంపీ సంజయ్ ఝాను తమ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ ఎన్నుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా నేతలు ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

హోదా ఇవ్వాలని  కేంద్రాన్ని కోరుతూ.. నితీష్‌ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గం గతేడాది ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో తాము ప్రత్యేక హోదా డిమాండ్లను పరిశీలించబోమని కేంద్రం గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.