బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!

బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!

బీజేపీతో నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకోబోతున్నారా..! బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారా..! అంటే అవుననే అనిపిస్తోంది. మణిపూర్ రాష్ట్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత(Janata Dal (United)), బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. మణిపూర్ రాష్ట్రంలో జేడీయూకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పటి వరకు జేడీయూ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు నితీష్ కుమార్.

మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కు ఈ మేరకు లేఖ రాసింది జేడీయూ పార్టీ. మణిపూర్ లో బీజేపీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి జనతాదళ్ యూ మణిపూర్ శాఖ.. తన మద్దతును విత్ డ్రా చేసుకుంటుంది.. మా పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నాసిర్ ను ఇక నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పరిగణించండి అంటూ లేఖ రాసింది జేడీయూ మణిపూర్ శాఖ. 

Also Read :- కోల్‎కతా వైద్యురాలి హత్య కేసులో ట్విస్ట్

మణిపూర్ లో బీజేపీకి.. జేడీయూ మద్దతు విత్ డ్రా చేసుకోవడం వల్ల ఏర్పడే ప్రమాదం ఏమీ లేదు.. అక్కడి బీజేపీ ప్రభుత్వం కూలిపోదు. కాకపోతే నితీష్ కుమార్ మద్దతు వల్లే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బతుకుతున్నది.. నిలబడింది. కేంద్రంలో ఇంతలా మద్దతు ఇచ్చిన జేడీయూ.. ఇప్పుడు మణిపూర్ లో అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవటం ఏంటనేది ఆసక్తిగా మారింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతోనూ జేడీయూ తెగతెంపులు చేసుకుంటుందా ఏంటీ.. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు ఇది సంకేతమా..! అన్న చర్చ మొదలైంది. నితీష్ కుమార్ ఇప్పుడే.. ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వెనక కారణాలు ఏంటీ అనేది ఆసక్తిగా మారింది.

2022లో మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో జేడీ(యూ) పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. జేడీయూకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం జేడీయూలో మిగిలింది ఒక్క ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకున్నది జేడీయూ. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. జేడీయూ, టీడీపీ మద్దతుతోనే నెట్టుకొస్తున్నది.