Nitish Rana: కవలలకు తండ్రి కాబోతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్

Nitish Rana: కవలలకు తండ్రి కాబోతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్

భారత క్రికెటర్.. కోల్ కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ నితీష్ రాణా కవల పిల్లలకు తండ్రి కాబోతున్నాడు. నితీష్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌ ద్వారా ఈ శుభవార్తను షేర్ చేశాడు. అతన్ని భార్య సాంచి మార్వా త్వరలో కవలలకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉందని రాణా తెలిపాడు. రానా తన భార్యతో కలిసి ఉన్న ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..“స్టేడియాల నుండి సైట్ సందర్శనల వరకు, ఇప్పుడు మా అతిపెద్ద ప్రాజెక్ట్‌కి ఇద్దరు చిన్న టీం మేట్స్ త్వరలో వస్తున్నారు". అని రాశాడు. ఫ్యాన్స్ రాణాకు సోషల్ మీడియాలో  అభినందనలు తెలుపుతున్నారు.  

నితీష్,సాంచి ప్రేమకథ

నితీష్ రాణా,సాంచి మార్వా త్వరలో కవలలకు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇద్దరి ప్రేమకథ ఒక సినిమా కథకు ఏ మాత్రం తక్కువ కాదు. వారిద్దరూ తొలిసారి ఒక పార్టీలో కలుసుకున్నట్లు సమాచారం. అందంగా కనిపించిన సాంచితో నితీష్ తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ 2018 సంవత్సరంలో నిశ్చితార్థం చేసుకుని 2019 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. నితీష్,సాంచి వివాహం చేసుకుని 6 సంవత్సరాలు అయింది. 

Also Read:-మతాన్ని బలవంతంగా రుద్దకూడదు.. షమీకి మద్దతుగా షమా మహమ్మద్..

రాజస్థాన్ రాయల్స్ కు రాణా 

నితీష్ రాణా క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే ఇటీవలే ముగిసిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకోవడంలో  కీలక పాత్ర పోషించాడు. ఈ ట్రోఫీలో రాణా 299 పరుగులు చేయడంతో పాటు 21 సిక్సర్లుకొట్టి టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా నిలిచాడు. నితీష్ 2025 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. 2024 లో జరిగిన మెగా ఆక్షన్ లో రానాను రూ. 4.2 కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ లో  కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా జట్టును నడిపించాడు. ఈ 27 ఏళ్ళ ఆల్ రౌండర్ టీమిండియా తరపున ఒక వన్డే.. రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు.