IPL 2025 Mega Action: నా భర్త బాగా ఆడినా తీసుకోలేదు: ఫ్రాంచైజీపై భారత క్రికెటర్ భార్య విమర్శలు

IPL 2025 Mega Action: నా భర్త బాగా ఆడినా తీసుకోలేదు: ఫ్రాంచైజీపై భారత క్రికెటర్ భార్య విమర్శలు

ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ బ్యాటర్ నితీష్ రాణాను ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. కనీసం ఆక్షన్ లోనైనా ఆ దక్కించుకోవడానికి ఆసక్తి చూపించలేదు. భవిష్యత్ ఆటగాడిగా రానాకు మంచి పేరుంది. పైగా అతను 2018 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన రానాకు కేకేఆర్ చెక్ పెట్టింది. అతని కోసం కనీసం RTM కార్డు కూడా ఉపయోగించలేదు. 

రాజస్థాన్ రాయల్స్ వేలంలో రూ. 4.20 కోట్ల రూపాయలకు నితీష్ రాణాను కొనుగోలు చేసింది. దీంతో నితీష్ రాణా వాళ్ళ భార్య కేకేఆర్ ఫ్రాంచైజీపై పరోక్షంగా విమర్శలు గుప్పిచింది. "విధేయత చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు దీన్ని భరించలేరు". అని ఆమె తన ఎక్స్ లో తెలిపింది. ఈ మాటలు చూస్తుంటే ఆమె కేకేఆర్ ఫ్రాంచైజీని అన్నట్టుగా స్పష్టంగా అర్ధమవుతుంది. ఓ వైపు వెంకటేష్ అయ్యర్ కోసం రూ. 23.75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేకేఆర్ రాణాపై ఆసక్తి చూపించలేదు. ఈ విషయంలో ఆమె తీవ్రంగా నిరాశకు గురయ్యి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ALSO READ | AUS vs IND: కోహ్లీకి మాతో పని లేదు.. అతనితోనే మాకు అవసరం: జస్ప్రీత్ బుమ్రా

ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టు తరపున నితీష్ రాణా అద్భుతంగా ఆడాడు. 2018లో రూ.3.40 కోట్లకు ఫ్రాంచైజీ అతనిని ఎంపిక చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో జట్టు రూ. 8 కోట్లకు అతన్ని దక్కించుకుంది. మొత్తం 86 ఇన్నింగ్స్‌లలో 136.32 స్ట్రైక్ రేట్‌తో 2,199 పరుగులు చేసాడు. లీగ్ చరిత్రలో కోల్‌కతా తరపున అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా రాణా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా 2023 అందుబాటులో లేకపోతే కేకేఆర్ కెప్టెన్ గా రానా వ్యవహరించాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో మాత్రం చేతి వేలి గాయం కారణంగా రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు.