టెస్టు టీమ్‌‌‌‌లోకి నితీశ్ రెడ్డి

టెస్టు టీమ్‌‌‌‌లోకి నితీశ్ రెడ్డి
  • ఆస్ట్రేలియాతో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీకి ఎంపిక
  • అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌, హర్షిత్ రాణాకు చాన్స్‌‌‌‌
  • సౌతాఫ్రికాతో టీ20 టీమ్‌‌‌‌లో తిలక్‌‌‌‌ వర్మకు చోటు

ముంబై: టీమిండియా యంగ్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ప్రమోషన్ దక్కించుకున్నాడు. టీ20ల్లో అరంగేట్రం చేసి ఆకట్టుకున్న  నితీశ్‌‌‌‌ ఇప్పుడు టెస్టు జట్టులోకి కూడా వచ్చాడు. ఐదు టెస్టుల బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే ఇండియా టెస్టు జట్టులో నితీశ్‌‌‌‌కు చోటు దక్కింది. అతనితో పాటు డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌లో దంచికొడుతున్న ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌, పేసర్‌‌‌‌‌‌‌‌ హర్షిత్‌‌‌‌ రాణాను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. అక్షర్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను పక్కనబెట్టగా, గాయంతో కుల్దీప్‌ దూరమయ్యారు. సీనియర్ పేసర్ షమీని సెలెక్టర్లు జట్టులోకి తీసుకోలేదు.  గాయం నుంచి కోలుకున్న మరో పేసర్ ప్రసిధ్‌‌‌‌ కృష్ణ జట్టులోకి తిరిగొచ్చాడు. 

ఈ జట్టుతో పాటు నాలుగు టీ20ల సిరీస్‌‌‌‌ కోసం సౌతాఫ్రికా వెళ్లే టీమ్‌ను కూడా సెలెక్టర్లు ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీ20 టీమ్‌‌‌‌లోకి హైదరాబాదీ తిలక్‌‌‌‌ వర్మ తిరిగి రాగా.. మిడిలార్డర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ రమణ్​దీప్ సింగ్‌‌‌‌, పేసర్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ వైశాక్‌‌‌‌, యష్ దయాల్‌‌‌‌ తొలిసారి ఎంపికయ్యారు. నవంబర్ 8, 10, 13, 15వ తేదీల్లో సౌతాఫ్రికాతో నాలుగు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబర్ 26 నుంచి పెర్త్‌‌‌‌లో జరిగే తొలి టెస్టుతో ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌ మొదలవుతుంది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 6–10 (అడిలైడ్ ఓవల్‌‌‌‌), డిసెంబర్ 14–10 (బ్రిస్టేన్‌‌‌‌), డిసెంబర్ 26–30 (మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌), జనవరి 3–7 (సిడ్నీ) తేదీల్లో చివరి నాలుగు టెస్టులు  జరుగుతాయి. 

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌ టీమ్‌‌‌‌: సూర్యకుమార్  (కెప్టెన్‌‌‌‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (కీపర్‌‌‌‌‌‌‌‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌‌‌‌ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌‌‌‌దీప్ సింగ్, విజయ్‌‌‌‌కుమార్ వైశాక్, అవేష్ ఖాన్ , యష్ దయాల్.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌‌‌‌ టీమ్‌‌‌‌: రోహిత్ (కెప్టెన్‌‌‌‌), బుమ్రా (వైస్ కెప్టెన్‌‌‌‌), జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, గిల్, కోహ్లీ, రాహుల్, పంత్ (కీపర్‌‌‌‌‌‌‌‌), సర్ఫరాజ్, ధృవ్ జురెల్ (కీపర్‌‌‌‌‌‌‌‌), అశ్విన్,  జడేజా, సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.