
జూబ్లీహిల్స్, వెలుగు: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నాడు. తర్వాత మ్యాచ్‌కోసం ముంబై వెళ్తూ.. అమ్మవారి దర్శనానికి వచ్చాడు. ప్రత్యేక పూజలు చేశాడు. ఈ నెల 12న ఉప్పల్ లో జరిగిన మ్యాచ్‌కు ముందు మరో ప్లేయర్అభిషేక్ శర్మతో కలిసి నితీశ్పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నాడు. ఆ మ్యాచ్ లో విజయం సాధించడంతో నితీశ్సోమవారం మరోసారి అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిసింది.