న్యూఢిల్లీ: నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ (గతంలో మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్) ఐపీఓకి వచ్చేందుకు సెబీ దగ్గర ప్రిలిమినరీ పేపర్లను ఫైల్ చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3 వేల కోట్లు సేకరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం, ఐపీఓలో ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా రూ.800 కోట్లను నివా బూపా సేకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద ఇన్వెస్టర్ ఫెటల్ టోన్ ఎల్‌ఎల్‌పీ రూ.1,880 కోట్ల విలువైన షేర్లను, ప్రమోటర్ బూపా సింగపూర్ హోల్డింగ్స్ పీటీఈ రూ.320 కోట్ల విలువైన షేర్లను అమ్మనున్నాయి. నివా బూఫాలో బూపా సింగపూర్ పీటీఈకి 62.27 శాతం వాటా ఉంది. ఫెటల్ టోన్ ఎల్ఎల్‌పీకి 27.86 శాతం వాటా ఉంది.