జర్నలిస్టుల సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం

ముస్తాబాద్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) లీడర్​ బాలశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. 

అర్హులైనవారికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. హెల్త్ కార్డులు ఇచ్చి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు వెంకటేశ్వరరావు, మైలారం, దేవేందర్, రవి, రాజేశ్‌‌‌‌‌‌‌‌, దేవరాజు, రాజ్ కిరణ్ రెడ్డి, శ్రీనివాస్, రవికాంత్, రమేశ్​పాల్గొన్నారు.