టాయ్.. టాకీ
పిల్లలు రెగ్యులర్‌గా రిమోట్‌తో నడిచే టాయ్ వెహికల్స్, జంతువుల బొమ్మలతో ఆడుకుంటుంటారు. అలాంటివాళ్లకు అప్పుడప్పుడు ఇలాంటి టాయ్స్ ఇస్తే.. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మార్కెట్‌లో చాలా కంపెనీలు ఈ వాకీటాకీలని అమ్ముతున్నాయి. 3–12 ఏళ్ల పిల్లలకు సెట్ అయ్యే టాయ్స్ ఇవి. ఈ వాకీటాకీ 20 మీటర్ల వరకు పనిచేస్తుంది. సైజు కూడా చిన్నగా ఉండడంతో పిల్లల చేతుల్లో సరిగ్గా ఇమిడిపోతుంది. స్మార్ట్‌ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఇలాంటివి ఇస్తే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. ఒక్కో వాకీటాకీలో మూడు ఏఏ బ్యాటరీలు వేయాలి. చిన్న డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఆన్/ఆఫ్ బటన్‌తోపాటు ఆపరేటింగ్ బటన్స్ ఉంటాయి.
ధర : జత 399 రూపాయల నుంచి మొదలు
ఎడ్యుకేషనల్ ల్యాప్‌టాప్
పెద్దవాళ్లు ల్యాప్‌టాప్, కంప్యూటర్లు ఆపరేట్ చేస్తున్నప్పుడు.. పిల్లలు కూడా అవి కావాలని మారాం చేస్తుంటారు. అలాంటి అల్లరి పిడుగుల కోసమే ఈ ఎడ్యుకేషనల్ ల్యాప్‌టాప్. దీన్ని వెబెటో అనే కంపెనీ తయారుచేసింది. దీని కీబోర్డ్‌లో నెంబర్లతోపాటు ఇంగ్లిష్ లెటర్స్ ‘ఎ నుంచి జెడ్’ వరకు ఉంటాయి. అవి పిల్లలకు అంకెలు, చిన్న చిన్న పదాలు నేర్చుకునేందుకు ఉపయోగపడతాయి. అంతేకాదు... ఇందులో కొన్ని మెలోడి ట్యూన్స్, గేమ్స్ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. పిల్లలు ఈజీగా నేర్చుకునేందుకు ఇందులో వర్డ్, మ్యూజిక్, సింగింగ్, క్విజ్ మోడ్స్ కూడా ఉంటాయి. మూడేండ్ల వయసు నుంచి పన్నెండేండ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇది బాగుంటుంది. ఇందులో నర్సరీ రైమ్స్ కూడా ఉంటాయి. పిల్లలకు లెర్నింగ్ కంపానియన్‌గా పనిచేస్తుంది ఈ ల్యాప్‌టాప్. ఇందులో మూడు ఏఏ బ్యాటరీలు వేయాలి.
ధర : 998 రూపాయలు
డిఫార్మబుల్ పెన్
పిల్లలకు ఇంట్రెస్ట్‌గా ఉండే బొమ్మలు ఇస్తే వాళ్లలో క్రియేటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటిదే ఈ పెన్. ఈ పెన్నుతో హోం వర్క్ చేసుకోవచ్చు. ఆడుకోవచ్చు కూడా. ఇది ఒక డిఫార్మబుల్ మ్యాగ్నెటిక్ రైటింగ్ పెన్. ఫింగర్ ఫిడ్జెట్ టాయ్‌గా కూడా వాడొచ్చు. దీనిలోని పార్ట్స్ ఊడదీసి నచ్చిన ఆకారాల్లో అంటే... రోబోల వంటి ఆకారాలుగా మార్చుకోవచ్చు.
ధర : 749 రూపాయలు
స్పైడర్ మ్యాన్ హ్యాండ్
స్పైడర్ మ్యాన్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. అందుకే ఆ థీమ్‌తో మార్కెట్‌లోకి వచ్చే వస్తువులు, టాయ్స్‌ని కొనిపెట్టమని పేరెంట్స్‌ని అడుగుతుంటారు. అలాంటి పిల్లలకు ఇది బెస్ట్ టాయ్. దీన్ని జావిలాంట్ డిజైనర్ అనే కంపెనీ తీసుకొచ్చింది. స్పైడర్ మ్యాన్ చేయిలా ఉండే ఈ బొమ్మ ట్రాన్స్‌మీటర్ కవర్ తెరిచి, లాంచర్ లోడ్ చేయాలి. ఆ తర్వాత స్టార్ట్ బటన్ నొక్కితే.. స్పైడర్ మ్యాన్ స్పైడర్ సిల్క్ లాంచ్ చేసినట్టే ఇందులో నుంచి ఒక దారం బయటకు వస్తుంది. దాని ముందుభాగంలోని సక్షన్ కప్పు నేల, గ్లాస్ లాంటివాటికి అతుక్కుంటుంది. దీన్ని ప్రీమియం మెటీరియల్‌తో చేశారు. చేతికి వేసుకునే గ్లౌకి ఫిక్స్ అయ్యి ఉండే దీన్ని నేచురల్ రబ్బరుతో తయారుచేశారు. అందుకే ఇది నేచర్ ఫ్రెండ్లీ గాడ్జెట్. దీనివల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది కలగదు.
ధర : 289 రూపాయలు