హైదరాబాద్ స్వదేశీ సంస్థానాన్ని పరిపాలించిన చివరి పాలకులు నిజాం నవాబులు. వారి కాలంలో హైదరాబాద్ రాజ్యం బాగా అభివృద్ధి జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ ను పాలించిన చివరి నవాబు. ఆయన కాలంలో ఎన్నో పరిశ్రమలు, రైల్వే మార్గాలు, రోడ్లు నిర్మించారు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనికునిగా పేరుపొందారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ కాలనీలో ఇప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు నిజాం మనువడి ప్యాలెస్. పార్క్ లో చిరాన్ ప్యాలెస్ అని ఇప్పటికీ ఉంటుంది.
ప్రతిరోజు ఎంతోమంది ఉదయం ఈ పార్కుకు వాకింగ్ కి వస్తుంటారు. ఈ పార్క్ లో నిజాం కాలంనాటి పెట్రోల్ పంప్ ఒకటి బయటపడింది. నిజాం ప్రభువు వాహనాలకు పెట్రోల్ పోసేందుకు ఈ ప్రైవేటు పంప్‌ను ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రాజు అల్లూరి అనే వ్యక్తి ఇటీవల దీనిని గుర్తించారు. డివిజనల్ అటవీ అధికారి రూపొందించిన పార్కు మేనేజ్‌మెంట్ ప్లాన్ ఆధారంగా ఆ పంప్ నేపథ్యాన్ని కనుగొన్నారు.